MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi-pakka-commercial33d75680-892a-44eb-9cd9-ca9216c33eab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi-pakka-commercial33d75680-892a-44eb-9cd9-ca9216c33eab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో దర్శకుడు మారుతీ కూడా అంతే ఎదురు చూస్తున్నాడట. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే తన సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు మారుతి. అసలు విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమాకి మారుతికి ఎలాంటి సంబంధం లేదు. tollywood;pawan;gopichand;kalyan;maruti;pawan kalyan;tollywood;cinema;court;genre;heroవకీల్ సాబ్ మీద ఆశలు పెట్టుకున్న మారుతి.. ఎందుకంటే ?వకీల్ సాబ్ మీద ఆశలు పెట్టుకున్న మారుతి.. ఎందుకంటే ?tollywood;pawan;gopichand;kalyan;maruti;pawan kalyan;tollywood;cinema;court;genre;heroMon, 18 Jan 2021 09:00:00 GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో దర్శకుడు మారుతీ కూడా అంతే ఎదురు చూస్తున్నాడట. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే తన సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు మారుతి. అసలు విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమాకి మారుతికి ఎలాంటి సంబంధం లేదు. 


కానీ ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ఇప్పుడు గోపీచంద్ తో మారుతి తెరకెక్కించే సినిమా కూడా దాదాపుగా ఈ కోవకే చెందిన సినిమానే అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్జోనర్ ని తెలుగు ప్రేక్షకులకు సక్సెస్ఫుల్ గా పరిచయం చేయగలిగితే అది తన సినిమాకి కూడా బాగా కలిసొస్తుందని మారుతీ ఫీల్ అవుతున్నాడు. చాలా మంది హీరోలకు చెప్పాక ఈ సినిమా కధ గోపీచంద్ కి చెప్పడంతో ఆయనకు నచ్చడం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వెంట వెంటనే జరిగిపోయాయి.


ఈ సినిమాలో అవినీతిపరుల తరుపున వాదించే లాయర్ గా గోపీచంద్ కనిపించనున్నాడు. డబ్బు ఇస్తే ఎలాంటి కరడుగట్టిన నేరస్థులు అయినా మంచి వాళ్లని కోర్టులో నమ్మించే లాయర్ పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు.  వీలైనంత త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మామూలుగా అయితే తన సినిమాల్లో హీరో కి ఏదో ఒక లోపం పెట్టి ఆ లోపం పేరిట నవ్విస్తూ ఉంటాడు మారుతి. మరి ఈ సినిమాలో కూడా అలాంటి లోపం ఏదైనా పెట్టాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.


ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>