PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaksind9b812a4-99a9-4ffb-baa7-175c68912dd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaksind9b812a4-99a9-4ffb-baa7-175c68912dd2-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కాదు కానీ చాలానే ప్రపంచంలో జరుగుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్ విశ్వ మానవాళి గొంతు నులిమి మరీ మారణ హోమం సృష్టించింది. ఇక ఆ తరువాత కరోనా వ్యాక్సిన్ అంటూ గత కొన్ని నెలలుగా దేశంలో ప్రచారం సాగుతూ వచ్చింది. ఇపుడు వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. vaksin;vishwa;hyderabad;india;central government;coronavirusకరోనా టీకా మీద డాక్టర్లకే డౌట్...?కరోనా టీకా మీద డాక్టర్లకే డౌట్...?vaksin;vishwa;hyderabad;india;central government;coronavirusSun, 17 Jan 2021 21:00:00 GMTకరోనా వైరస్ కాదు కానీ చాలానే ప్రపంచంలో  జరుగుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్ విశ్వ మానవాళి గొంతు నులిమి మరీ మారణ హోమం సృష్టించింది. ఇక ఆ తరువాత కరోనా వ్యాక్సిన్ అంటూ గత కొన్ని నెలలుగా దేశంలో ప్రచారం సాగుతూ వచ్చింది. ఇపుడు వ్యాక్సిన్ కూడా వచ్చేసింది.

భారత్ లో యితే రెండు వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్నారు. ఓ వైపు అట్టహాసంగా వ్యాక్సిన్ పంపిణీ దేశంలో సాగుతూంటే మరో వైపు ఈ వ్యాక్సిన్ల పని తీరు మీద కూడా అంతే వేడిగా వాడిగా చర్చ సాగుతోంది. భారత్ లో వినియోగంలోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లు కోవాగ్జిన్ కోవిషీల్డ్ లలో ఇపుడు కోవాగ్జిన్ మీద పెద్ద ఎత్తున డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.

అది కూడా వైద్యులే చేయడం విశేషం. హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ సంస్థ కోవాగ్జిన్ తయారు చేసింది. కోవీషీల్డ్ ని సీరం సంస్థ రూపొందించింది. అయితే ఈ రెండింటిలో తమకు కోవీషీల్డ్ ని మాత్రమే పంపిణీ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ రావడం జరుగుతోంది. దీనికి వైద్య వర్గాల మద్దతు కూడా ఉండడమే అసలైన పాయింట్.

కోవాగ్జిన్ పూర్తిగా పరీక్షలను చేయకుండా వినియోగానికి అనుమతులు ఇచ్చేశారు అంటూ వైద్య వర్గాలు అంటున్నాయట. దీని వల్ల సైడ్ అఫెక్టులు వస్తాయని కూడా చెబుతున్నారుట. డాక్టర్స్ అసోసియేషన్ అయితే  తమకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కావాలనీ, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పై తమ వైద్యులలోనే కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయనీ పేర్కొనడం గమనార్హం.

మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండూ ఒక్కటేనని, ఎటువంటి ఆందోళనలూ అవసరం లేదని కూడా చెబుతోంది. ఇంకో వైపు చూసుకుంటే భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది. ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబితే తాము నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పడం విశేషం. మరి ఇంతలా చెప్పినా కూడా అనుమానాలు వ్యక్తం చేయడం తప్పు. అది కూడా వైద్య వర్గాల నుంచి చేయడం అంటే దారుణమే. చూడాలి మరి దీన్ని ధీటుగా ఎలా ఎదుర్కొంటారో.




తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>