CrimeSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/21-years-experienced-journlist-cheated-by-online-cheaters81659e8f-7a0f-4696-9967-168303c3ce58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/21-years-experienced-journlist-cheated-by-online-cheaters81659e8f-7a0f-4696-9967-168303c3ce58-415x250-IndiaHerald.jpgనిధి రజ్దాన్ అనే మహిళ 1999 నుంచి 21 ఏళ్లపాటు ఎన్డీటీవీలో మహిళా జర్నలిస్టుగా పని చేశారు. అయితే ఈ ఏడాది తర్వాత తాను కెరీర్ మారుతున్నానని.. హార్వర్డ్ యూనివర్సిటీలో జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరబోతున్నానని 2020 జూన్ 13న ఆమె ట్వీట్ చేశారు. అందుకుగానూ హార్వర్డ్ ఉద్యోగం కోసమని ఆమె ఎన్డీటీవీలో ఉద్యోగాన్ని సైతం మానేశారు. కానీ తనకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రం ఎలాంటి ఆఫర్ రాలేదు.. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్నట్లుగా నిధి తెలిపారు. ఇక తనను మోసం చేసిన వాళ్లపై చట్టపరంగా పోరాడుతానని చెప్పారు.journalist;women;nidhi;telugu;police;university;media;2020;twitter;woman;news;professor;juneబొక్క బోర్లాపడ్డ 21 సంవత్సరాల అనుభవమున్న జర్నలిస్ట్....బొక్క బోర్లాపడ్డ 21 సంవత్సరాల అనుభవమున్న జర్నలిస్ట్....journalist;women;nidhi;telugu;police;university;media;2020;twitter;woman;news;professor;juneSun, 17 Jan 2021 11:45:00 GMTమీడియా సంస్థలో గడిచిన గత 21 ఏళ్ల పాటు పని చేసిన మహిళా జర్నలిస్టు కావటం విచారకరం. హార్వర్డ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగమంటూ ఆన్‌లైన్ ద్వారా ఈమెను చీటింగ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..



నిధి రజ్దాన్ అనే మహిళ 1999 నుంచి 21 ఏళ్లపాటు ఎన్డీటీవీలో మహిళా జర్నలిస్టుగా పని చేశారు. అయితే ఈ ఏడాది తర్వాత తాను కెరీర్ మారుతున్నానని.. హార్వర్డ్ యూనివర్సిటీలో జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరబోతున్నానని 2020 జూన్ 13న ఆమె ట్వీట్ చేశారు. అందుకుగానూ హార్వర్డ్ ఉద్యోగం కోసమని ఆమె ఎన్డీటీవీలో ఉద్యోగాన్ని సైతం మానేశారు. కానీ తనకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రం ఎలాంటి ఆఫర్ రాలేదు.. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్నట్లుగా నిధి తెలిపారు. ఇక తనను మోసం చేసిన వాళ్లపై చట్టపరంగా పోరాడుతానని చెప్పారు. ఇప్పటికే ఆమె పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తన దగ్గరున్న ఆధారాలను పోలీసులకు అందజేస్తానన్నారు. అటాకర్లు చాలా తెలివిగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనను మోసం చేశారని.. తన వ్యక్తిగత సమాచారంతో పాటు తన డివైజ్‌లు, ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్లలోకి యాక్సెస్ పొందారని నిధి తెలిపారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే.. హార్వర్డ్ యూనివర్సిటీలో అసలు జర్నలిజం విభాగమే లేదట. అందువల్ల అక్కడ జర్నలిజం బోధించే ప్రొఫెసర్లెవరూ లేరని సమాచారం. ఈ విషయాన్ని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన జోషువా బెంటన్ వెల్లడించారు. నీమన్ ఫౌండేషన్, షోరెన్‌స్టెయిన్ సెంటర్ ఫర్ మీడియా, పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ ద్వారా మాత్రమే హార్వర్డ్‌ లో జర్నలిస్టులకు శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా జర్నలిజానికి సంబంధించిన ఫ్యాకల్టీ మాత్రం హార్వర్డ్‌ లో లేరట. ఇక తాను మోసపోయానని నిధి ప్రకటించగానే.. ట్విట్టర్‌లో ‘హార్వర్డ్’, ఎన్డీటీవీ ట్రెండ్ అయ్యాయి. #NidhiWentToHarvard అనే హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


" style="height: 370px;">


" style="height: 370px;">




ఒకే ఒక్క ఫోటోతో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారుగా ......??

వామ్మో ..... ఒక్కవారం లో ఇంత విధ్వంశమా .....??

అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>