PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp43a126e0-8ec6-4523-9ca8-92554bb65311-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp43a126e0-8ec6-4523-9ca8-92554bb65311-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు హిందు మతాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు హిందు మతం వ్యవహారం సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరినామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. టీడీపీ నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మత మార్పిడులు హిందూ మతంపై దాడులు యథేచ్చగా సాగుతున్నtdp, ap;anil music;chakravarthy;praveen;telugu desam party;bandara;jagan;v vijayasai reddy;andhra pradesh;american samoa;telugu;police;media;youtube;chief minister;you tube;minister;arrest;jaggery;tdp;central government;aurangzeb;reddy;partyబ్రదర్ అనీల్ ని టార్గెట్ చేసిన టీడీపీబ్రదర్ అనీల్ ని టార్గెట్ చేసిన టీడీపీtdp, ap;anil music;chakravarthy;praveen;telugu desam party;bandara;jagan;v vijayasai reddy;andhra pradesh;american samoa;telugu;police;media;youtube;chief minister;you tube;minister;arrest;jaggery;tdp;central government;aurangzeb;reddy;partySun, 17 Jan 2021 15:48:42 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు హిందు మతాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు హిందు మతం వ్యవహారం సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరినామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. టీడీపీ నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి  కీలక వ్యాఖ్యలు చేసారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో మత మార్పిడులు హిందూ మతంపై దాడులు యథేచ్చగా సాగుతున్నాయనడానికి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన ఆరోపించారు. ప్రవీణ్ చక్రవర్తి వీడియోలు యూట్యూబ్ లోవైరల్ అవుతున్నా అడ్డుకోని పోలీసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి వెనకున్నావారెవరు అని నిలదీశారు. అతనికి అమెరికా నుంచి సాయం చేస్తున్నవారెవరు... అతన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీనేతలెవరు అనే అంశాలపై డీజీపీ ఎందుకు విచారణ జరపడం లేదు? అని నిలదీశారు.

బెల్లంపల్లిలో ఒక పాస్టర్ చంద్రబాబు నాయుడిని దారుణంగా దూషిస్తే, డీజీపీ అతనిపై ఎందుకు చర్యలుతీసుకోలేదు? అని ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి వంటివారిని రాష్ట్రం పైకి వదిలేసి, విజయసాయి రెడ్డి అండతో ఏపీలో మత మారణ హోమం సృష్టించాలని జగన్ చూస్తున్నాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అవినీతి, నేరాల్లో ఏ1గా ఉన్న వ్యక్తి నిన్నటి వరకు తుగ్లక్ మాదరి వ్యవహరించి, నేడు హిందూ మతంపై దాడుల విషయంలో ఔరంగజేబుని మించిపోతున్నాడు అని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన బావ బ్రదర్ అనిల్ వ్యవహారశైలి వల్లే రాష్ట్రంలో హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయి తప్ప, అవి ఎవరూ కావాలని చేస్తున్నవి కావు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హిందూమతానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలపై  కేంద్రం జోక్యం చేసుకొని, ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.


సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>