PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc-comments-on-chandrababu9dede5a9-8e1e-4d78-b140-6780a2bbfb9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc-comments-on-chandrababu9dede5a9-8e1e-4d78-b140-6780a2bbfb9f-415x250-IndiaHerald.jpgచంద్రబాబు తనకు నచ్చిన వారితో ఒక విధంగా మరియు నచ్చని వారితో ఒక విధంగా ప్రవర్తించే వారని చెప్పారు. ఈ విషయం తాను చంద్రబాబుకు కూడా చాలా సార్లు వ్యక్తిగతంగా, బహిరంగంగానే చెప్పానని జేసీ అన్నారు. ఇక ముందైనా తనలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదని ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.jc comments on chandrababu;cbn;tiru;jagan;jcdiwakarareddy;ananthapuram;chief minister;anantapuram;tdp;reddy;partyజగన్ చేతిలో మళ్లీ చంద్రబాబుకు చావుదెబ్బే: జేసీ దివాకర్ రెడ్డి...!జగన్ చేతిలో మళ్లీ చంద్రబాబుకు చావుదెబ్బే: జేసీ దివాకర్ రెడ్డి...!jc comments on chandrababu;cbn;tiru;jagan;jcdiwakarareddy;ananthapuram;chief minister;anantapuram;tdp;reddy;partySun, 17 Jan 2021 11:00:00 GMTటీడీపీ అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో మార్పులు జరిగాయి. ముఖ్యంగా టీడీపీ కి చెందిన పలువురు నాయకులు వైసీపీలోకి జంప్ అవడం. కొంతమంది నాయకులు పరోక్షంగా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు జేసీ బ్రదర్స్ కూడా టీడీపీకి ప్రతికూలంగా మారుతున్నారు. అనంతపురంలో జేసీ బ్రదర్స్ కి తిరుగులేదని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు వీరి హవా మెల్ల మెల్లగా తగ్గుతోంది. ఎందుకంటే వీరికున్న వ్యాపారాలను కాపాడుకోవాలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుపై  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏవిధమైన వైఖరి ప్రదర్శించేవారో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటే డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పాలని అప్పుడే పార్టీ గురించి ప్రజలపై మంచి అభిప్రాయం ఉంటుందని హితోక్తి పలికారు. అంతేకాకుండా తన  పరిపాలనా కాలంలో ఎక్కువ సమయాన్ని అధికారులతో సమీక్షలు చేయడం, ఇతరత్రా చర్చలు జరపడం వంటి వాటికే ఎక్కువ సమయాన్ని వృధాచేసే వారని, కనీసం ఇప్పటికైనా తన పద్దతిని మార్చుకోవాలని చెప్పారు. ఎవరైనా తనను కలవడానికి వస్తే వారి బాగోగులు వారి కుటుంబ విషయాలు ఎన్నడూ అడిగిన పాపాన పోలేదని జేసీ అన్నారు.

చంద్రబాబు తనకు నచ్చిన వారితో ఒక విధంగా మరియు నచ్చని వారితో ఒక విధంగా ప్రవర్తించే వారని చెప్పారు.  ఈ విషయం తాను చంద్రబాబుకు కూడా చాలా సార్లు వ్యక్తిగతంగా, బహిరంగంగానే చెప్పానని జేసీ అన్నారు. ఇక ముందైనా తనలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదని ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే పార్టీ కి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు జేసీ. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా జగన్ చంద్రబాబుకి దెబ్బేస్తారని జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబుకు సలహాలు మరియు సూచనలు ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయాలను చంద్రబాబు ఎలా తీసుకుంటారో తెలియాల్సి ఉంది.


నాకు పోటీ ఎవరో తెలిసింది.. ఇక నుంచి సీరియస్‌గా తీసుకుంటా: రామ్

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>