MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/if-one-thinks--another-is-happening31c2a52d-d870-4122-a65b-15ee4eab47cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/if-one-thinks--another-is-happening31c2a52d-d870-4122-a65b-15ee4eab47cd-415x250-IndiaHerald.jpgఎప్పుడెప్పుడా అని కలలు కంటాం. ఎదురుచూస్తాం. అదిగో ఇదిగో అంటూ సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ.. కల తీరదు. ఒక్కోసారి ఇలా అనుకోవడం ఆలస్యం అన్ని పనులూ చకచకా జరిగిపోతాయి. అప్పుడెప్పుడో ఎనౌన్స్‌ చేసిన నాగ అశ్విన్‌ మూవీ.. ఆదిపరుష్‌ ఇంతవరకు సెట్స్‌పైకి రాకపోయినా... నెల కూడా కాకుండానే.. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే మూవీ 'సలార్‌' లాంఛనంగా మొదలైపోయింది. కెజిఎఫ్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న సమయంలోనే ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో తర్వాతి మూవీ సలార్‌ను ఎనౌన్స్‌ చేసేశాడు. కెజిఎఫ్‌ మాదిరి మరో రెండేళ్ల వరకif one thinks .. another is happening;view;ram gopal varma;kushi;naga;prasanth;prashanth neel;vijay;cinema;bahubali;naga aswin;kannada;director;joseph vijay;prasanth neel;prashant kishorఒకటి అనుకుంటే.. మరొకటి జరిగిపోతోంది..!ఒకటి అనుకుంటే.. మరొకటి జరిగిపోతోంది..!if one thinks .. another is happening;view;ram gopal varma;kushi;naga;prasanth;prashanth neel;vijay;cinema;bahubali;naga aswin;kannada;director;joseph vijay;prasanth neel;prashant kishorSun, 17 Jan 2021 20:30:00 GMTనాగ అశ్విన్‌ మూవీ.. ఆదిపరుష్‌ ఇంతవరకు సెట్స్‌పైకి రాకపోయినా... నెల  కూడా కాకుండానే.. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే మూవీ 'సలార్‌' లాంఛనంగా మొదలైపోయింది.

కెజిఎఫ్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న సమయంలోనే ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో తర్వాతి మూవీ సలార్‌ను ఎనౌన్స్‌ చేసేశాడు. కెజిఎఫ్‌ మాదిరి మరో రెండేళ్ల వరకు సలార్‌ రాదనుకున్నారు. ప్రభాస్‌ మరోవైపు  ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌.. నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ఎనౌన్స్‌ చేశారు. చివర్లో ప్రకటించిన సలార్‌ ముందుగా సెట్స్‌పైకి వచ్చేసింది.

నెలాఖరు నుంచి సలార్‌ షూటింగ్‌ మొదలవుతుంది. సాధ్యమైనంతవరకు ఈ ఏడాదే రిలీజ్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సలార్‌ ఓపెనింగ్‌ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తనకు అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్‌..  ప్రభాస్‌కు థ్యాంక్స్‌ చెప్పారు.  'సలార్' మిమ్మల్ని నిరాశపరచదని పేర్కొన్నాడు. ఈకార్యక్రమానికి యశ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

కెజిఎఫ్‌2 టీజర్‌ ఇచ్చిన కిక్‌తో కెజిఎఫ్‌2 టీం ఖుషీ ఖుషీగా ఉంది. టీజర్‌ 24 గంటల్లో 70 మిలియన్ వ్యూవ్స్‌... రెండు రోజుల్లో 100 మిలియన్‌ దాటిసి ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. అలాగే తక్కువ టైంలో 150 మిలియన్‌ వ్యూవ్స్‌ సాధించింది. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌కు మాత్రమే కాకుండా దక్షిణాది చిత్రపరిశ్రమ కూడా కన్నడ ఇండస్ట్రీని సరిగ్గా గుర్తించలేదని.. ‘కేజీయఫ్‌-2’తో ప్రశాంత్‌నీల్‌, యశ్‌ శాండిల్‌వుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని ఆర్జీవీ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాహుబలి.. ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చిన  వ్యూవ్స్‌ను కెజిఎఫ్‌2తో పోలుస్తూ.. మూడు రోజుల్లో 14 కోట్ల వ్యూవ్స్‌ సొంతం చేసుకుందన్నాడు వర్మ.






క్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>