PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-firef33b67d-a2cc-4bdd-8552-646f6015698e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-firef33b67d-a2cc-4bdd-8552-646f6015698e-415x250-IndiaHerald.jpg కేసిఆర్ రాజకీయ వారసుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు , మరెన్నో టెన్షన్ లకు గురవుతున్నారు. తెలంగాణ సీఎం పీఠంపై కూర్చునేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో, పార్టీలో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వాటిని అధిగమించేందుకు మరెన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా టిఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించే పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రధాన రాజకీయ శత్రువుగా బిజెపి ఉండడం, ఆ పార్టీ ఈ మధ్యకాలంలో బాగా బలం పెంచుకోవడం టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత dgp goutham savang jagan ttd;auto;ktr;bharatiya janata party;korcha;warangal;telangana;cm;chief minister;air;letter;party;shatru1కేటీఆర్ కు అన్నీ సవాళ్ళే ? ఇజ్ఞత్ కా సవాల్కేటీఆర్ కు అన్నీ సవాళ్ళే ? ఇజ్ఞత్ కా సవాల్dgp goutham savang jagan ttd;auto;ktr;bharatiya janata party;korcha;warangal;telangana;cm;chief minister;air;letter;party;shatru1Sun, 17 Jan 2021 05:00:00 GMT
కేసిఆర్ రాజకీయ వారసుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు , మరెన్నో టెన్షన్ లకు గురవుతున్నారు. తెలంగాణ సీఎం పీఠంపై కూర్చునేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో, పార్టీలో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వాటిని అధిగమించేందుకు మరెన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా టిఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించే పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రధాన రాజకీయ శత్రువుగా బిజెపి ఉండడం,  ఆ పార్టీ ఈ మధ్యకాలంలో బాగా బలం పెంచుకోవడం టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం,  ఇవన్నీ టిఆర్ఎస్ తో పాటు కేటీఆర్ కు పెద్ద ఇబ్బందికరంగా మారింది. 





ఆ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా, అవి సాధ్యపడడం లేదు. ఇప్పటికే గ్రేటర్, దుబ్బాక ఎన్నికలలో టిఆర్ఎ స్ కు ఎదురు గాలి బాగా వీచింది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు,  అలాగే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇలా ఎన్నో ఉండడంతో,  కేటీఆర్ మరింత టెన్షన్ పడుతున్నారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు. అప్పుడే సీఎం పీఠంపై ప్రశాంతంగా కూర్చోగలను అని అభిప్రాయపడుతున్నారు. కానీ దానికి తగ్గ పరిస్థితులు ఏర్పడడం లేదు. 





ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను గుర్తించి వారిని బుజ్జగించడం, నియోజకవర్గాల వారీగా గ్రూపు రాజకీయాలు పెరిగిన నేపథ్యంలో వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించి,  పార్టీలోని నాయకులకు బాధ్యతలు అప్పగించి పరిస్థితులను చక్క దిద్దుతూ, కేటీఆర్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో గెలిచి ఆ ఉత్సాహంతో సీఎం పీఠంపై కూర్చోవాలని చూస్తున్నారు. అందుకే గత కొద్ది రోజులుగా ఇంతగా కేటీఆర్ టెన్షన్ పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.






హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>