MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr6c09a476-2c08-4bd7-8f4a-9046ddbf3207-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr6c09a476-2c08-4bd7-8f4a-9046ddbf3207-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీయార్ కొత్త సినిమా ఏంటి అన్నది ఇపుడు ఒక పెద్ద ఆసక్తికరమైన న్యూస్. మార్చి తో ఆర్ ఆర్ ఆర్ మూవీకి గుమ్మడి కాయ కొట్టేసి ఎన్టీయార్ కొత్త సినిమాకు షిఫ్ట్ అవుతారని అంటున్నారు. ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్ళుగా ఒకే సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీయార్ ఇక మీదట తన జోరును పెంచుతారని టాక్. jr ntr;ntr;gummadi;jr ntr;rrr movie;cinema;hero;march;aravinda sametha veera raghavaఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?jr ntr;ntr;gummadi;jr ntr;rrr movie;cinema;hero;march;aravinda sametha veera raghavaSun, 17 Jan 2021 19:30:00 GMTజూనియర్ ఎన్టీయార్ కొత్త సినిమా ఏంటి అన్నది ఇపుడు ఒక పెద్ద ఆసక్తికరమైన న్యూస్. మార్చి తో ఆర్.ఆర్.ఆర్ మూవీకి  గుమ్మడి కాయ కొట్టేసి ఎన్టీయార్ కొత్త సినిమాకు షిఫ్ట్ అవుతారని అంటున్నారు. ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్ళుగా ఒకే సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీయార్ ఇక మీదట తన జోరును పెంచుతారని టాక్.

ఇక కొత్త సినిమా విషయంలో నాలుగైదు ప్రొడక్షన్లు లైన్ లో ఉన్నా కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రం తోనే ఎన్టీయార్ మూవీ చేస్తారని ఇప్పటికైతే టాక్. ఈ మూవీ విషయంలో అన్నీ చకచకా సాగుతున్నాయి. ఈ మూవీకి మొదట అనుకున్న పేరు అయినను పోయి రావలె  హస్తినకు. ఈ మధ్యన మరో పేరు వినిపిస్తోంది. అదే చౌడప్పనాయుడు. అంటే హీరో క్యారక్టరైజేషన్ నుంచి వచ్చిన పేరుగా భావిస్తున్నారు.

అయితే ఇప్పటికి చూస్తే ఈ టైటిల్ కూడా కన్ ఫర్మ్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఈ మూవీ విషయంలో త్రివిక్రం కి సెంటిమెంట్లు ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అ అన్న అక్షరంతో టైటిల్స్ పెట్టడం త్రివిక్రం కి అలవాటు. ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం ఆ తోనే మరో పవర్ ఫుల్ టైటిల్ గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు.

మరి చౌడప్పనాయుడు కంటే కూడా అయినను పోయి రావలె హస్తినకు  అన్న టైటిల్ బాగుందని కూడా చిత్ర యూనిట్ నుంచి మరో మాట వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే జూనియర్ ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ విషయంలో ఇంకా ఏదీ తేలలేదని మాత్రం అంటున్నారు. తొందరలోనే టైటిల్ ఫైనలైజ్ చేసి షూటింగ్ కి ముహూర్తం ఖరార్ చేస్తారని అంటున్నారు. ఈ మూవీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ పాలిటిక్స్ మీదనే ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది.




ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరోయిన్.. ఈసారి ఎవరంటే..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>