PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pongulateski-rajyasabha-offer1daeefcf-cb91-4e89-9fb5-340a6c4b20cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pongulateski-rajyasabha-offer1daeefcf-cb91-4e89-9fb5-340a6c4b20cb-415x250-IndiaHerald.jpg గ‌త కార్పోరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పొంగులేటి ఎంపీ హోదాలో ఉండ‌టంతో త‌న వ‌ర్గీయుల‌కు కార్పోరేష‌న్ టికెట్లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల ఓట‌మి పాల‌వ‌డం, అజ‌య్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం.. అనుహ్యంగా పొంగులేటికి పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం.. అయినా ఆయ‌న పార్టీలో కొన‌సాగ‌డం.. రాజ్య‌స‌భ టికెట్ ద‌క్కుతుంద‌ని ఆశించినా.. ఫ‌లితం లేకుండా పోవ‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగాయి. అయితే ఇప్ప‌టికీ ఆయ‌న త‌న క్యాడ‌ర్‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నారు. మ‌ధ్య‌లో బీజేపీలోకి వెళ్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాponguleti;ktr;mp;district;assembly;minister;v;partyఅసంతృప్తిని బ‌య‌ట‌పెట్టిన పొంగులేటి.. ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో పెనుమార్పు..?అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టిన పొంగులేటి.. ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో పెనుమార్పు..?ponguleti;ktr;mp;district;assembly;minister;v;partySun, 17 Jan 2021 21:11:40 GMTఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిమానమే తనకు చాలా పెద్ద పదవి అని, పదవి రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదని అన్నారు. పదవి పోయేటప్పుడు కాంక్రీట్‌ గోడలు కట్టినా లాభం ఉండదని వ్యాఖ్యానించారు. పదవులు ఎవరి సొత్తూ కాదని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తారని చెప్పుకొచ్చారు. వేంసూర్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. టీఆర్‌ఎస్‌లో ఉన్నాం.. రేపు కూడా ఇదే పార్టీలో ఉంటాం.కానీ ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు మంచిదికాదు. నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలియని అసమర్థుడిని కాను.


నా వారిని ఇబ్బంది పెట్టినవారు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. చక్రవడ్డీతో సహా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. అధికారం ఉందికదా అని ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదు. నేను ప్రజాప్రతినిధిని కాను, ఎవరి పర్మిషనూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్లాల్సిందే. నా వర్గం ప్రజాప్రతినిధులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’అని పొంగులేటి పేర్కొన్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఖ‌మ్మం రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. మ‌రి కొద్దిరోజుల్లో  కార్పోరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను అధిష్ఠానం సైతం సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.



గ‌త కార్పోరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పొంగులేటి ఎంపీ హోదాలో ఉండ‌టంతో త‌న వ‌ర్గీయుల‌కు కార్పోరేష‌న్ టికెట్లు ద‌క్కాయి.  ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల ఓట‌మి పాల‌వ‌డం, అజ‌య్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం.. అనుహ్యంగా పొంగులేటికి పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం.. అయినా ఆయ‌న పార్టీలో కొన‌సాగ‌డం.. రాజ్య‌స‌భ టికెట్ ద‌క్కుతుంద‌ని ఆశించినా.. ఫ‌లితం లేకుండా పోవ‌డం వంటి ప‌రిణామాలు జ‌రిగాయి. అయితే ఇప్ప‌టికీ ఆయ‌న త‌న క్యాడ‌ర్‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నారు. మ‌ధ్య‌లో బీజేపీలోకి వెళ్తార‌న్న ప్ర‌చారం  జోరుగా సాగింది. అయితే ఆయ‌న కొట్టిపారేశారు. మ‌ధ్య‌లో కేటీఆర్ ఖ‌మ్మం ప‌ర్య‌ట‌నలో  పొంగులేటి ఇంటికి  స్వ‌యంగా వెళ్లి అల్ప‌హారం విందు స్వీక‌రించారు. అయితే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో పొంగులేటి అసంతృప్తితో ఉన్న‌ట్లుగా స్ప‌ష్టం చేస్తున్నాయి.




టీడీపీకి వైసీపీ నుంచి లీకులు... జగన్ ఫైర్

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>