MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pavan-kalyanff5cf7a5-e428-4164-8b83-6c0ceac26e10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pavan-kalyanff5cf7a5-e428-4164-8b83-6c0ceac26e10-415x250-IndiaHerald.jpgఅసలు సినిమాలే చేయడేమో అని భావించిన పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్ళి పోతున్నాడు. ఇప్పటికే ఆయన ఒప్పుకున్న సినిమాల లిస్టు దగ్గరదగ్గరగా అర డజనుకు చేరింది. ఆయన మరో సినిమా ఒప్పుకున్నాడు అనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతానికి పవన్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయ్యాక ఆయన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక పీరియాడిక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా tollywood;pawan;ravi;bandla ganesh;harish shankar;kalyan;krish;ram pothineni;ram talluri;ravi teja;shankar;surender reddy;janasena;cinema;producer;remake;saira narasimhareddy;producer1;janasena party;reddyఆ సినిమాని పొలిటికల్ మైలేజ్ కోసం వాడనున్నారా ?ఆ సినిమాని పొలిటికల్ మైలేజ్ కోసం వాడనున్నారా ?tollywood;pawan;ravi;bandla ganesh;harish shankar;kalyan;krish;ram pothineni;ram talluri;ravi teja;shankar;surender reddy;janasena;cinema;producer;remake;saira narasimhareddy;producer1;janasena party;reddySun, 17 Jan 2021 16:00:00 GMTఅసలు సినిమాలే చేయడేమో అని భావించిన పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్ళి పోతున్నాడు. ఇప్పటికే ఆయన ఒప్పుకున్న సినిమాల లిస్టు దగ్గరదగ్గరగా అర డజనుకు చేరింది. ప్రస్తుతానికి పవన్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయ్యాక ఆయన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక పీరియాడిక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే యోచనలో ఉన్నాడు దర్శకుడు క్రిష్. 

ఇక పవన్ హీరోగా నటిస్తున్న మలయాళం రీమేక్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. అది కాకుండా బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది ఆ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇప్పటి దాకా క్లారిటీ లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

అదేంటంటే ఈ సినిమాని పవన్ పొలిటికల్ కెరీర్ కోసం ఉపయోగించనున్నారని అంటున్నారు. సైరా అలాంటి సినిమా తెరకెక్కించిన సురేందర్ రెడ్డి పవన్ హీరోగా ఒక పొలిటికల్, యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమాని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నిజానికి ఈయన పవన్ కి చాలా సన్నిహితుడు. గత ఎన్నికల సమయంలో కూడా జనసేన కోసం ఈయన పని చేశాడని అంటున్నారు. ఇక గతంలో ఈ నిర్మాత రవితేజ హీరోగా నేల టికెట్ అనే సినిమా తెరకెక్కించి డిజాస్టర్ మూటగట్టుకున్నారు.




సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>