PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ndhra-pradesh-top-in-covid-vaccinationfea20961-44a7-470c-b867-267e5c0addf3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ndhra-pradesh-top-in-covid-vaccinationfea20961-44a7-470c-b867-267e5c0addf3-415x250-IndiaHerald.jpgకోవిడ్ టెస్టులు చేయడంలో దేశంలోనే టాప్ లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. జనాభా ప్రతిపాదికన ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుంది. అంతేకాదు రికవరీల్లోనూ ఏపీనే ప్రధమ స్థానంలో ఉంది. ఏపీలో కోవిడ్ రికవరీ రేటు 99 శాతంగా ఉంది. ఏపీలో ఒక్కరోజు లక్ష వరకు కోవిడ్ టెస్టులు నిర్వహించారcovid vacciene;andhra pradesh;population;letter;96కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఏపీ టాప్!కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఏపీ టాప్!covid vacciene;andhra pradesh;population;letter;96Sun, 17 Jan 2021 12:51:27 GMTజనాభా ప్రతిపాదికన ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుంది. అంతేకాదు  రికవరీల్లోనూ ఏపీనే ప్రధమ స్థానంలో ఉంది. ఏపీలో కోవిడ్ రికవరీ రేటు 99 శాతంగా ఉంది. ఏపీలో ఒక్కరోజు లక్ష వరకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ లోనూ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లో నిలుస్తోంది. తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ఏపీలో  విజయవంతమైంది. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు కల‌గ‌లేదు.
           
         దేశ వ్యాప్తంగా తొలి రోజు లక్షా 95 వేల మందికి  పైగా కోవిడ్ టీకాలు వేశారు. ఏపీలో తొలి రోజే 19 వేల108 మందికి టీకా వేశారు. అంటే దేశంలో వేసిన మొత్తం కోవిడ్ టీకాల్లో దాదాపు 10 శాతం ఒక్క ఆంధ్రపదేశ్ లోనే వేశారు. జనాభా లెక్కన తొలి రోజు ఎక్కువ మందికి టీకా వేసిన రాష్ట్రాల్లో ఏపీనే టప్ లో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం తొలి రోజు 4 వేలకు లోపే కోవిడ్ టీకాలు వేశారు.

   అంతేకాదు చాలా రాష్ట్రంలో ఆదివారం కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించడం లేదు. కాని ఏపీలో మాత్రం
332 కేంద్రాల్లో రెండో రోజు ఆదివారం కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. ఏపీలో తొలి ద‌శ‌లో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏపీకి మొత్తం 4.96 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చింది.కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌ను  వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు ఉచితంగా వేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. అన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు జిల్లాల్లోనే డ్రైరన్ చేపట్టగా.. ఏపీలో మాత్రం అన్ని జిల్లాల్లో డ్రై రన్ నిర్వహించారు. 


అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>