MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8eccc676-a0fc-49b9-a901-6f3657bffdb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8eccc676-a0fc-49b9-a901-6f3657bffdb6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ కానున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల నుండి వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న దుబాయ్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరిmahesh babu latest photo;sarkaru vari paata;mahesh;namrata shirodkar;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;tollywood;cinema;rajani kanth;media;heroine;posters;mythri movie makers;gmb entertainments;dubai;partyఒకే ఒక్క ఫోటోతో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారుగా ......??ఒకే ఒక్క ఫోటోతో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారుగా ......??mahesh babu latest photo;sarkaru vari paata;mahesh;namrata shirodkar;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;tollywood;cinema;rajani kanth;media;heroine;posters;mythri movie makers;gmb entertainments;dubai;partySun, 17 Jan 2021 11:23:21 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ కానున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల నుండి వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న దుబాయ్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లబించిన విషయం తెలిసిందే.

మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాని గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించనుండగా దీనిని అత్యంత భారీ వ్యయంతో 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం ఇటీవల కొన్నాళ్లుగా తమ మేకోవర్ లో పూర్తిగా మార్పులు చేసి ఎంతో ఫిట్ గా రెడీ అవ్వడంతో పాటు ఫుల్ గా క్రాఫ్ పెంచిన మహేష్ బాబు, ప్రస్తుతం అదే స్టయిల్ తో పలు యాడ్స్, ఫంక్షన్స్ లో దర్శనమిస్తున్నారు. ఇటీవల ఆ స్టైల్ తో ఆయన నటించిన యాడ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండగా, రెండు రోజుల క్రితం మంచు విష్ణు సతీమణి విరోనికా జన్మదినం సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక పార్టీ కి సూపర్ స్టార్ మహేష్ దంపతలు కూడా హాజరయ్యారు.

ఇక ఆ వేడుకకి విచ్చేసి సందడి చేసిన మహేష్, నమ్రతలకు విష్ణు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహేష్ గ్లామర్ ని పొగుడుతూ నిన్న ఒక పోస్ట్ చేశారు. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా కూడా రోజు రోజుకు సూపర్ స్టార్ అందం మరింతగా పెరుగుతోంది, దానికి కారణం ఆయన మంచి మనసు అంటూ విష్ణు మహేష్, నమ్రత లతో దిగిన ఫోటోని పోస్ట్ చేసారు. కాగా ఆ ఫోటో నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాలను ఎంతగానో ఊపేస్తోంది. మరోవైపు పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్, సర్కారు వారి పాటలో మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లో ఎలా ఉంటారో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కాగా ఈ సినిమాని మహేష్ జన్మదినం సందర్భంగా ఆగష్టు 9 న రిలీజ్ చేయాలని చూస్తుందట మూవీ యూనిట్.....!!


ఎండు ద్రాక్ష నీటిని తాగితే రక్తహీనత తగ్గుతుందా?

అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>