PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/akhila-brahmanandhabcb5dc7b-787f-44d3-8626-7581ee8c464b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/akhila-brahmanandhabcb5dc7b-787f-44d3-8626-7581ee8c464b-415x250-IndiaHerald.jpgఅప్ప‌టి ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుని క‌లిసి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మ‌ని అడిగితే ఇప్పుడు డ‌బ్బులు ఎక్క‌డ‌వ‌ని చెప్పి షాక్ ఇచ్చి పంపారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో శిల్పా వార‌సుడు ర‌వికిషోర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయాక అస్స‌లు అడ్ర‌స్ లేకుండా పోయారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీలోనే కొన‌సాగారు. త‌న బంధువుల నుంచి త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ (బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి) స‌హా వైసీపీలోనే ఉన్నా బ్ర‌హ్మానంద‌రెడ్డి మాత్రం పేరుకు akhila brahmanandha;shilpa;bhuma akhila priya;assembly;mla;letter;tdp;ycp;reddy;banaganapalli;bhuma nagi reddy;nandyalaనాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!akhila brahmanandha;shilpa;bhuma akhila priya;assembly;mla;letter;tdp;ycp;reddy;banaganapalli;bhuma nagi reddy;nandyalaSun, 17 Jan 2021 16:39:41 GMTతెలుగు రాజ‌కీయాల‌కు అనూహ్యంగా ప‌రిచ‌య‌మైన లీడ‌ర్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి. దివంగ‌త భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆస‌క్తి రేపింది. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏకంగా 13 రోజుల పాటు నంద్యాల‌లోనే మ‌కాం వేసి మ‌రీ నాటి వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న మందీ మార్బ‌లాన్ని పూర్తిగా అక్క‌డ దింప‌డంతో పాటు కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రించ‌డంతో చివ‌ర‌కు టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్రహ్మానంద‌రెడ్డి 27 వేల ఓట్ల భారీ మెజార్టీత ఘ‌న‌విజ‌యం సాధించారు.

ఆ ఎన్నిక‌ల్లో గెలుపుతో బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీలోనే కాకుండా... తెలుగు రాజ‌కీయాల్లో హైలెట్ అయ్యారు. ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన వెంట‌నే కొద్ది నెల‌ల‌కే నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, అప్ప‌టి ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుని క‌లిసి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మ‌ని అడిగితే ఇప్పుడు డ‌బ్బులు ఎక్క‌డ‌వ‌ని చెప్పి షాక్ ఇచ్చి పంపారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో శిల్పా వార‌సుడు ర‌వికిషోర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయాక అస్స‌లు అడ్ర‌స్ లేకుండా పోయారు.

ఎన్నిక‌ల త‌ర్వాత కూడా బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీలోనే కొన‌సాగారు. త‌న బంధువుల నుంచి త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ (బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి) స‌హా వైసీపీలోనే ఉన్నా బ్ర‌హ్మానంద‌రెడ్డి మాత్రం పేరుకు టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. ఇక తాజాగా అఖిల‌ప్రియ కేసుల ఎపిసోడ్‌లో అస్స‌లు బ్రహ్మానంద‌రెడ్డి ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు.. ఆయ‌న వాయిస్ ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌ భూమా కుటుంబ స‌భ్యులు చాలా మంది అఖిల‌కు దూరం అవుతూ వ‌చ్చార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే అఖిల సైతం నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డిని ప‌క్క‌న పెట్టేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సొంత సోద‌రుడు జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డిని రంగంలోకి దింపేలా పావులు క‌దుపుతోంద‌ట‌. ఈ ప‌రిణామాల‌తో బ్ర‌హ్మానంద‌రెడ్డి అటు అఖిల‌కు దూరం జ‌ర‌గ‌డంతో పాటు ఇటు పార్టీకి కూడా దూరం దూరంగా ఉంటోన్న‌ట్టు టాక్ ? 


సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?

కేజిఎఫ్ లో యాష్ తల్లిగా నటించిన అర్చన జోయిస్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>