MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/jagan6dd87c1b-9e34-445d-aaeb-9a4eed60ba57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/jagan6dd87c1b-9e34-445d-aaeb-9a4eed60ba57-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ 175 నియోజకవర్గాల్లో ఒకచోట డిపాజిట్ కోల్పోయి, పరువు పోగొట్టుకుంది. 174 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీకి కొంతవరకు పోటీ ఇచ్చారు. కానీ అరకు అసెంబ్లీ స్థానంలో టీడీపీ డిపాజిట్ కోల్పోయింది. jagan;kumaar;jagan;sravan kumar;assembly;mla;minister;tdp;local language;ycp;pregnant;kidari sravan kumar;araku valley;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...jagan;kumaar;jagan;sravan kumar;assembly;mla;minister;tdp;local language;ycp;pregnant;kidari sravan kumar;araku valley;partySun, 17 Jan 2021 05:00:00 GMTటీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ 175 నియోజకవర్గాల్లో ఒకచోట డిపాజిట్ కోల్పోయి, పరువు పోగొట్టుకుంది. 174 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీకి కొంతవరకు పోటీ ఇచ్చారు. కానీ అరకు అసెంబ్లీ స్థానంలో టీడీపీ డిపాజిట్ కోల్పోయింది.

జగన్ ఇమేజ్ వల్ల వైసీపీ నుంచి పోటీ చేసిన చెట్టి ఫాల్గుణ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక రెండో స్థానంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొన్ను దొర నిలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కేవలం 20 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. అయితే జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఫాల్గుణ, తనకు సాధ్యమైన మేర నియోజకవర్గంలో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాగో ఎలాంటి లోటు లేకుండా అందుతున్నాయి. ఇంకా కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అరకు పర్యాటక ప్రాంతం కావడం బాగా కలిసొచ్చే అంశం. ప్రభుత్వం కూడా అరకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ కనీస వసతులైన రహదారులు, మంచినీరు, వైద్యం లాంటివి ఇక్కడ ప్రజలకు సరిగా అందడం లేదు. గర్భిణీ స్త్రీలు సదుపాయాలు లేక తమ గుడిసెలలోనే ప్రసవించడం వల్ల ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాలు కూడా ఎక్కువే. అలాగే స్థానికంగా ఉండే హార్టికల్చర్, లక్కబొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించి, వాటి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాల్సిన అవసరముంది.

రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ జగన్ ఇమేజ్ బాగా ఉంది. అదే ఎమ్మెల్యేకు ప్లస్. కానీ టీడీపీ నుంచి ఓడిన శ్రవణ్ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కొన్నిరోజులు పార్టీ తరుపున కార్యక్రమాలు చేసిన శ్రవణ్, గత రెండు, మూడు నెలల నుంచి పార్టీలో కనిపించడం లేదు. దీంతో ఆయన జంప్ కొట్టడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇలా శ్రవణ్ యాక్టివ్‌గా లేకపోవడం టీడీపీకి బాగా మైనస్ అవుతుంది.




అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>