MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f314e0ff71-ef4e-4131-9e62-77a88ccd2e4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f314e0ff71-ef4e-4131-9e62-77a88ccd2e4f-415x250-IndiaHerald.jpgఅనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మించారు. ఇక మళ్ళి రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ ఎఫ్3. అందరూ అదే తారాగf3;anil ravipudi;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;devi sri prasad;kranthi;kranti;prince;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;cinema;sankranthi;media;f2;audience;blockbuster hit;heroine;success;sri venkateshwara creations;dil;f3ఈసారి అంతకు మించి ఉంటుందట ... ఆడియన్స్ కాస్కోండి ....??ఈసారి అంతకు మించి ఉంటుందట ... ఆడియన్స్ కాస్కోండి ....??f3;anil ravipudi;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;devi sri prasad;kranthi;kranti;prince;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;cinema;sankranthi;media;f2;audience;blockbuster hit;heroine;success;sri venkateshwara creations;dil;f3Sun, 17 Jan 2021 23:50:13 GMTఅనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మించారు. ఇక మళ్ళి రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ ఎఫ్3. అందరూ అదే తారాగణంతో మొదటి భాగాన్ని మించేలా మరింత ఎక్కువ ఫన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇటీవల కోవిడ్ కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా తొలి షెడ్యూల్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి కొద్దిసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ఫోటో పోస్ట్ చేసారు. షూటింగ్ ఎంతో సందడిగా సాగుతోందని, మొదటి భాగాన్ని మించేలా తప్పకుండా ఈ మూవీ రిలీజ్ తరువాత భారీ సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ కూడా అనిల్ రావిపూడి పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఎంతో ఎంజాయ్ చేసానని, తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేయడం జరిగింది.

కాగా వెంకటేష్ రెండవ షెడ్యూల్ లో జాయిన్ అవుతారని, ఇక అక్కడి నుండి నిరంతరాయంగా ఏ మాత్రం బ్రేక్స్ లేకుండా షెడ్యూల్స్ కొనసాగుతాయని, వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ పూర్తి చేసి దీనిని థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇక ఈ మూవీ కోసం దేవిశ్రీ అద్భుతమైన ఐదు సాంగ్స్ ని ఇప్పటికే సిద్ధం చేసారని, వెంకీ, వరుణ్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఎఫ్ 3 మూవీ తో పాటు ఇందులోని సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయని సమాచారం. మరి ఈ సినిమా మొదటి భాగాన్ని మించేలా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి.....!! 


కాశ్మీర్ ప్రశాంతం.. టెర్రరిస్టులు కూడా...

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>