PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/union-minister-kishan-reddy-letter-to-telangana-cm-kcra6e60a1c-6150-422c-a7bd-e2b670225baa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/union-minister-kishan-reddy-letter-to-telangana-cm-kcra6e60a1c-6150-422c-a7bd-e2b670225baa-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ బకాయి పడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, ఎంఎంటీఎస్ పనులు ఆగిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలంటే కేసీఆర్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ విస్తరణ పనులపై ఆయన కేసీఆర్ ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ పనులకోసం హామీ ఇచ్చిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని, దీని వలన అదనపు భారం పడుతుందని వివరించారాయన. kcr kishan reddy;chiranjeevi;kcr;hyderabad;telangana;g kishan reddy;minister;press;letter;yadadri;central government;reddy;railకేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..kcr kishan reddy;chiranjeevi;kcr;hyderabad;telangana;g kishan reddy;minister;press;letter;yadadri;central government;reddy;railSun, 17 Jan 2021 17:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ బకాయి పడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, ఎంఎంటీఎస్ పనులు ఆగిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలంటే కేసీఆర్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ విస్తరణ పనులపై ఆయన కేసీఆర్ ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ పనులకోసం హామీ ఇచ్చిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని, దీని వలన అదనపు భారం పడుతుందని వివరించారాయన.

కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని, కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతూ, తెలంగాణలో అభివృద్ధి పనులు జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని గతంలోనే కిషన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. అందులో ఎంఎంటీఎస్ విస్తరణ కూడా ఉంది. ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ ఆయన కేసీఆర్ కు లేఖ రాశారు.

ఎంఎంటీఎస్‌ విస్తరణ పనుల కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.789 కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.414 కోట్లు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి వివరించారు. పనులు చేయడం ఆలస్యమైతే ప్రాజెక్టుపై భారం పడుతుందని లేఖలో వివరించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ వెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో మెట్రో రైల్ సేవలు అందిస్తున్నా.. ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఎంఎంటీఎస్ పై చాలామంది ఆధారపడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, చిరుద్యోగులు సైతం ఎంఎంటీఎస్ పైనే ఆధారపడి ప్రయాణాలు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ను యాదాద్రి వరకు విస్తరిస్తే.. మరింత ఉపయోగం ఉంటుందనేది కిషన్ రెడ్డి వాదన. కరోనా కంటే ముందు సాధారణ ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాలనుంచి హైదరాబాద్ కి వచ్చేవారు. ఇప్పుడు రైళ్ల సంఖ్య తగ్గడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ విస్తరణ పూర్తయి ఉంటే వారికి చాలా ఉపయోగంగా ఉంటుందని కిషన్ రెడ్డి అంటున్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం  బకాయి పడ్డ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 


సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?

కేజిఎఫ్ లో యాష్ తల్లిగా నటించిన అర్చన జోయిస్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>