EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp9dfa0519-ffbd-4704-80f9-3fc4b5a3578d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp9dfa0519-ffbd-4704-80f9-3fc4b5a3578d-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి రావాలని కలలు కంటున్న బిజెపి ఏటిలో అందుకు తగ్గ రాజకీయ పరిస్థితులను కల్పించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్నా, అనేక కారణాలతో ఆ పార్టీ ఏపీలో బలం పెంచుకోలేకపోయింది. తెలంగాణలో పరిస్థితి ఇదే మాదిరిగా ఒకప్పుడు ఉన్నా, ఇప్పుడు అక్కడ బీజేపీ బాగా బలపడింది. అధికారం సంపాదించే అంత స్థాయిలో ఉంది. కానీ ఏపీలో పరిస్థితి ఆ విధంగా లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలకు దీటుగా అక్కడ పాగా వేయాలని బిజెపి కలలు కంటోంది. కేవలం ఏపీలో అధికారంలోకి రావాలి అనేది కలగానే సరిపెటbjp ap ysrcp tdp kapu caste;auto;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;kamma;andhra pradesh;janasena;rajya sabha;telugu;letter;tdp;ycp;janasena party;mudragada padmanabham;reddy;partyఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?bjp ap ysrcp tdp kapu caste;auto;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;kamma;andhra pradesh;janasena;rajya sabha;telugu;letter;tdp;ycp;janasena party;mudragada padmanabham;reddy;partySun, 17 Jan 2021 16:00:00 GMTఅధికారంలోకి రావాలని కలలు కంటున్న బిజెపి ఏటిలో అందుకు తగ్గ రాజకీయ పరిస్థితులను కల్పించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్నా, అనేక కారణాలతో ఆ పార్టీ ఏపీలో బలం పెంచుకోలేకపోయింది. తెలంగాణలో పరిస్థితి ఇదే మాదిరిగా ఒకప్పుడు ఉన్నా, ఇప్పుడు అక్కడ బీజేపీ బాగా బలపడింది. అధికారం సంపాదించే అంత స్థాయిలో ఉంది. కానీ ఏపీలో పరిస్థితి ఆ విధంగా లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలకు దీటుగా అక్కడ పాగా వేయాలని బిజెపి కలలు కంటోంది. కేవలం ఏపీలో అధికారంలోకి రావాలి అనేది కలగానే  సరిపెట్టుకోకుండా దాన్ని నిజం చేసుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే గత కొంతకాలంగా ఏపీ బిజెపి వ్యవహారం చూస్తే బాగా బలం పెంచుకున్న ట్టుగా కనిపిస్తోంది .





 అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది. దీనికోసం  గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టిడిపి కమ్మ పార్టీ, వైసిపి రెడ్డి పార్టీగా ముద్ర పడిన నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు కాపులకు దగ్గరవ్వాలని చూస్తోంది. ఆ పార్టీలో కాపు నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఆయన ద్వారా మిగతా బలమైన కాపు సామాజికవర్గ నేతలను బీజేపీలో చేర్చుకుని పనికి శ్రీకారం చుట్టారు. మాజీమంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను చేర్చుకునేందుకు బిజెపి ఎన్నో రకాల ప్రయత్నలు చేస్తోంది. 






 రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పార్టీలో కి తీసుకు రావడం ద్వారా  మొత్తం కాపు సామాజిక వర్గం అంతా బిజెపికి అండగా నిలబడుతుందని, అప్పుడు అధికారంలోకి రావచ్చని లెక్కలు వేసుకుంటోంది. దీంతోపాటు జనసేన పార్టీ తో పొత్తు ఉంది కాబట్టి  ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారికి అండదండలు తమకు కలిసి వస్తాయని బిజెపి నమ్ముతోంది. జనసేన బిజెపి పొత్తు ద్వారా సులువుగా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో బిజెపి ఉంది. అందుకే ఇప్పుడుఆయనకుకాపు సామాజిక వర్గం పై పూర్తిగా ఆశలు పెట్టుకుని బీజేపీ దానికి అనుగుణంగా  ఏర్పాట్లు చేసుకుంటోంది. కాపు సంఘాల నాయకులను చేర్చుకుని తద్వారా కాపులకు దగ్గరవ్వాలనే లెక్కల్లో బిజెపి ఉన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. బీజేపీ ఎత్తుగడలు ఎంతవరకు కలిసి వస్తాయి అనేది ముందు ముందు చూడాలి.





సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

కేజిఎఫ్ లో యాష్ తల్లిగా నటించిన అర్చన జోయిస్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>