Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/former-cm-kumaraswamy-angry-on-amit-shah315507f0-1486-47a5-a76b-9d79f7593d6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/former-cm-kumaraswamy-angry-on-amit-shah315507f0-1486-47a5-a76b-9d79f7593d6a-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రి అమిత్‌ షాపై కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ నేత హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అమిత్ షా ఆవిష్కరించిన ఓ శిలాఫలకంపై కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యతో అమిత్ షా కర్ణాకటక ప్రజలను..karnataka;amit shah;shimoga;india;karnataka - bengaluru;amith shah;district;government;chief minister;twitter;kannada;hindi;minister;tamilnadu;central governmentమమ్మల్ని అవమానిస్తావా..?.. అమిత్‌ షాపై మాజీ సీఎం ఫైర్మమ్మల్ని అవమానిస్తావా..?.. అమిత్‌ షాపై మాజీ సీఎం ఫైర్karnataka;amit shah;shimoga;india;karnataka - bengaluru;amith shah;district;government;chief minister;twitter;kannada;hindi;minister;tamilnadu;central governmentSun, 17 Jan 2021 23:25:03 GMTకేంద్ర మంత్రి అమిత్‌ షాపై కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ నేత హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అమిత్ షా ఆవిష్కరించిన ఓ శిలాఫలకంపై కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యతో అమిత్ షా కర్ణాకటక ప్రజలను అవమానించారని, కన్నడ సంస్కృతిని ఆయన పక్కపెట్టి, కన్నడ భాషను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సహించరాని చర్య అని ఆయనన్నారు. షిమోగా జిల్లా భద్రావతిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్‌ శంకుస్థాపనలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై హిందీ, ఆంగ్ల భాషను మాత్రమే వినియోగించడాయన్ని కుమారస్వామి ఖండించారు.

కర్ణాటక రాష్ట్రంలో ఆ రెండు భాషలకు ఉన్న ప్రాధాన్యం రాష్ట్ర మాతృభాషకు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని, ఈ చర్యతో అమిత్ షా రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని, ఇది కన్నడిగుల ప్రతిష్టకే అవమానమని కుమారస్వామి మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై, అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్ఏఎఫ్ యూనిట్‌కు భూమి కేటాయించినది కర్ణాటకాయేనని కుమారస్వామి గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే షిమోగా జిల్లా భద్రావతిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూనిట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన ఫలకంపై కేవలం హిందీ, ఆంగ్ల భాషను మాత్రమే వినియోగించారు. శిలాఫలకంపై ఎక్కడా కర్ణాటక రాష్ట్ర భాష కన్నడ కనిపించలేదు. దీంతో ప్రతిపక్షాలు కర్ణాటక ప్రభుత్వంపై మండిపడ్డాయి. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇంతకు ముందు కూడా దక్షిణాదిలో ఇలాంటి సంఘటనలే జరిగాయి. ముఖ్యంగా తమిళనాడుకు, కేంద్ర సర్కార్ కు మధ్య తరచుగా ఇలాంటి వివాదాలు ఏర్పడుతుంటాయి. కేంద్రం హిందీని దక్షిణ భారతదేశంపై రుద్దే ప్రయత్నం చేస్తోందని తమిళనాడు పదే పదే ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో కర్ణాటక కూడా చేరింది.

" style="height: 517px;">

" style="height: 209px;">




మహేష్, పవన్, ఎన్టీఆర్ .... ఏకంగా ముగ్గురినీ లైన్ లో పెట్టాడుగా .....??

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>