PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi47195fe7-7910-4aca-b7ac-eb9247ae7298-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi47195fe7-7910-4aca-b7ac-eb9247ae7298-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోడీ మరో సారి సూపర్ హిట్ అయ్యారు. అది ఎక్కడా ఎందుకు ఎలా అన్న దానికంటే ముందు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మోడీ మంచి వ్యూహకర్త. ఆయన అజేయుడు. ఆయన తెర వెనక ఉండి గుజరాత్ లో ఎంతో మందిని ముఖ్యమంత్రులను చేశారు. ఇక తానుగా పుష్కర కాలం పైగా గుజరాత్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలారు. modi;view;modi;tiru;bharatiya janata party;india;gujarat - gandhinagar;narendra modi;prime minister;central government;coronavirus;narendraమోడీ మళ్ళీ సూపర్ హిట్...?మోడీ మళ్ళీ సూపర్ హిట్...?modi;view;modi;tiru;bharatiya janata party;india;gujarat - gandhinagar;narendra modi;prime minister;central government;coronavirus;narendraSun, 17 Jan 2021 10:30:00 GMTప్రధాని నరేంద్ర మోడీ మరో సారి సూపర్ హిట్ అయ్యారు. అది ఎక్కడా ఎందుకు ఎలా అన్న దానికంటే ముందు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మోడీ మంచి వ్యూహకర్త. ఆయన అజేయుడు. ఆయన తెర వెనక ఉండి గుజరాత్ లో ఎంతో మందిని ముఖ్యమంత్రులను చేశారు. ఇక తానుగా పుష్కర కాలం పైగా గుజరాత్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలారు.

ఇక జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే మోడీ ఎకాఎకిన ప్రధాని అయిపోయారు. ఇప్పటికి ఏడేళ్ళుగా దేశానికి తిరుగులేని ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. ఇక మోడీ హయాంలో దేశంలో పాలించే బీజేపీ రాష్ట్రాల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలో మోడీ కే కాదు యావత్తు ప్రపంచానికే అనుకోని పెను సవాల్ గా కరోనా వైరస్ వచ్చిపడింది.

లాక్ డౌన్ పెట్టి ఏదో విధంగా భారత్ లో దాన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అన్నింటి కంటే మిన్నగా భారతీయుల రోగ నిరోధకశక్తి కారణంగా కూడా కరోనా దేశంలో పెద్దగా ప్రభావం చూపలేదు. ఇపుడు ఏకంగా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఇలాంటి వ్యాక్సిన్ తయారు చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలకు ఎంతో పేరు. ఉంది. వారంతా రాత్రీ పగలు కష్టపడి వ్యాక్సిన్ తయారు చేశారు.

ఇపుడు అదే మోడీ ఇమేజ్ ని మరో మెట్టు ఎక్కించింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన ప్రధాని మొత్తం క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. వైద్య పరిశోధకులు రాత్రీ పగలూ లెక్కచేయకుండా కష్టించి చేసిన దానికి ఫలితం వ్యాక్సిన్. అయితే మోడీ చక్కగా తన ప్రసంగంలో తమ ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చిందన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

నిజానికి దేశీయ బయోటిక్ సంస్థలకు కేంద్రం నుంచి పెద్దగా ఏ రూపేణా  సాయం లభించలేదని విమర్శలు కూడా ఉన్నాయి. ఎవరికి వారే కష్టపడి వ్యాక్సిన్ తయారీ చేసి రికార్డ్ టైం లో జనం ముంచు ఉంచారు. అయినా అక్కడ ఉన్నది మోడీ కాబట్టి ఆయన ఖాతాలొనే దీన్ని వేస్తూ బీజేపీ కూడా సంబరాలు చేస్తోంది. మొత్తానికి మరోసారి సూపర్ హిట్ అయిపొయారంతే.




జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>