Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/woman-marries-sonc890cc15-3183-4782-8969-726054146886-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/woman-marries-sonc890cc15-3183-4782-8969-726054146886-415x250-IndiaHerald.jpgచాలా రోజుల క్రితం ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చేసింది. ఆ తరువాత అనూహ్యంగా తన కొడుకునే పెళ్ల చేసుకుంది. అప్పట్లో ఈ న్యూస్ రష్యాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ తల్లీ, కొడుకు జంటకు ఓ బిడ్డ కూడా జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరు..woman marries son;women;prema;marriage;love;woman;fatherభర్తకు విడాకులిచ్చి కొడుకుతో కాపురం.. ఇప్పుడు మరో బిడ్డకు...భర్తకు విడాకులిచ్చి కొడుకుతో కాపురం.. ఇప్పుడు మరో బిడ్డకు...woman marries son;women;prema;marriage;love;woman;fatherSun, 17 Jan 2021 10:51:01 GMTఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల క్రితం ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చేసింది. ఆ తరువాత అనూహ్యంగా తన కొడుకునే పెళ్ల చేసుకుంది. అప్పట్లో ఈ న్యూస్ రష్యాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ తల్లీ, కొడుకు జంటకు ఓ బిడ్డ కూడా జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కొత్తగా జన్మించిన తన చిన్నారి బిడ్డతో దిగిన ఫోటోను ఆ మహిళ సోషల్ మీడియాలో ఈ మధ్యనే పోస్ట్ చేసింది.

రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల మరియా అనే మహిళ 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిని పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అప్పటికే ఆ వ్యక్తికి పదేళ్ల బాబు ఉన్నాడు. పదేళ్ల కాపురం తరువాత మరియా తన భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, కొడుకు వ్లాదిమిర్ తన సవతి తల్లి మరియాను విడిచి ఉండలేకపోయాడు. ఆమెను తరచూ కలిసేవాడు. దీంతో ఆమెకు అతడి ప్రవర్తనలో మార్పు కనిపించింది.

ఈ క్రమంలోనే మరియాకు తన కొడుకు తనపై చూపిస్తున్న ప్రేమ గురించి అర్థమైంది. అది తల్లి కొడుకుల అనుబంధం కాదని, అంతకు మించి అని అర్థం చేసుకుంది. అదే విషయాన్ని వ్లాదిమిర్‌కు కూడా చెప్పింది. ఇద్దరం కలిసి జీవిద్దామని, పెళ్లి చేసుకుందామని మరియా చెప్పడంతో వ్లాదిమిర్ తెగ ఆనందపడిపోయాడు.

ఇద్దరు వివాహం చేసుకున్నారు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక తండ్రి కూడా ఒకే చెప్పాడు. సవతి కొడుకును వివాహం చేసుకున్న మరియా కొన్నిరోజులకు గర్భవతి అయ్యింది. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ విషయంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తూ.. తల్లి, బిడ్డల మధ్య ఉన్న సంబంధానికి కళంకం తెచ్చిపెట్టావంటూ మండిపడుతున్నారు. కానీ మరికొంత మంది మాత్రం అతడు సవతి కొడుకని, అందులోనూ భర్తతో విడాకులు తీసుకోవడంతో ఆమెకు ఆ కుటుంబానికీ సంబంధం లేకుండా పోయిందని, ఇప్పుడు వారిద్దరి మధ్య తల్లీ, కొడుకుల సంబంధం లేకపోవడం వల్ల వారు పెళ్లి చేసుకున్నా తప్పేమీ కాదని మద్దతుగా మాట్లాడుతున్నారు.




ప్చ్‌... ప్ర‌భాస్ ఇంత డిజ‌ప్పాయింట్ చేస్తాడ‌ని ఊహించ‌లేదే...!

అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>