PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderc926a448-ae3f-47be-aaab-82dc1e22be00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderc926a448-ae3f-47be-aaab-82dc1e22be00-415x250-IndiaHerald.jpgసినిమాలను చూసి నిజ జీవితంలో చాలా మంది మర్డర్లు చేస్తుంటారనేది తెలిసిన విషయమే. మరోపక్క సినిమా కథలకు నిజ జీవితాల్లో జరిగే సంఘటనలే ప్రేరణగా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాన్ని చూసి ఉండరు. తీస్తే మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది ఈ కథ. పూర్తి వివరాల్లోకి వెmurder;jeevitha rajaseskhar;mumbai;cinema;whatsapp;police;marriage;october;girl;murder.;vదృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకుని.. ఈ వ్యక్తి మృతదేహాన్ని ఎక్కడ దాచాడో తెలిస్తే..దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకుని.. ఈ వ్యక్తి మృతదేహాన్ని ఎక్కడ దాచాడో తెలిస్తే..murder;jeevitha rajaseskhar;mumbai;cinema;whatsapp;police;marriage;october;girl;murder.;vSun, 17 Jan 2021 02:36:49 GMTసినిమా కథలకు నిజ జీవితాల్లో జరిగే సంఘటనలే ప్రేరణగా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాన్ని చూసి ఉండరు. తీస్తే మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది ఈ కథ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్మాల్కర్ అనే 34 ఏళ్ల నిందితుడు 32 ఏళ్ల వయసున్న అమితా మోహితే ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి ఇంట్లోనూ ఒప్పుకున్నారు. అంతా బాగుందని అనుకునే సరికి అమిత అదృశ్యమైపోయింది. గత ఏడాది అక్టోబర్ 21న హర్మాల్కర్‌ను కలిసేందుకు వెళుతున్నానంటూ అమిత తన ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వచ్చింది.

అంతే.. ఆ తర్వాత అమిత ఏమైపోయిందో ఎవరికి తెలియదు. కానీ.. ఆమె వాట్సాప్ నుంచి కుటుంబ సభ్యులకు హర్మాల్కర్‌ను పెళ్లి చేసుకున్నట్టు ఓ మెసేజ్ వచ్చింది. ఆ తరువాత హర్మాల్కర్ కూడా కనిపించకుండా పోయాడు. అయితే గత వారం మాత్రం అమిత సోదరుడికి హర్మాల్కర్ ఓ రోడ్డు మీద కనిపించాడు. అమిత గురించి అడిగినా ఏం చెప్పకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు హర్మాల్కర్ చెప్పే సమాధానాలకు విసుగెత్తిపోయారు. హర్మాల్కర్ ఏదో దాస్తున్నాడన్న విషయం అర్థమైపోయి తమదైన శైలిలో విచారించగా.. అమితను హత్య చేసినట్టు చెప్పేశాడు. తనకు ముందే పెళ్లి అయిందని, ఈ విషయం తెలియక అమిత తనను వివాహం చేసుకోమంటూ వేధిస్తుండటం వల్లే ఆమెను చంపేశానని చెప్పాడు.

ఆమె శవం కనిపించకుండా చేసేందుకు తనకు దృశ్యం సినిమానే స్ఫూర్తి అని కూడా చెప్పాడు. ఆ సినిమా స్పూర్తితో తన ఇంట్లోని అటక పైన అమిత మృతదేహాన్ని పెట్టి చుట్టూ గోడ కట్టేసినట్టు తెలిపాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా ఉండేందుకు సిమెంటు, సున్నంలో యాంటీ లీకేజీ గ్లూ కూడా కలిపినట్టు వివరించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. నిందితుడి ఇంటికి వెళ్లి గోడను పగుల గొట్టగా వారికి ఓ అస్థి పంజరం కనిపించింది. అస్థి పంజరాన్ని డీఎన్ఏ పరీక్షలకు పంపి.. నిందితుడిపై పలు కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.


మోనాల్ ను అంత మాట అన్నారా? .. అయ్యో పాపం..!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>