Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/jagan-moham-reddyd9ea8942-109e-4715-9f86-036d204a9037-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/jagan-moham-reddyd9ea8942-109e-4715-9f86-036d204a9037-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల ఇప్పటికే ఏడాదిగా విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. దీంతో వారి చదువు చాలా వరకు కుంటుపడింది. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రాల్లోని పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులు కూడా మళ్లీ పాఠశాలలకు.. jagan moham reddy;amala akkineni;jagan;amaravati;andhra pradesh;marchరేపటి నుంచి స్కూళ్ళు ప్రారంభం.. వేసవి సెలవుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..రేపటి నుంచి స్కూళ్ళు ప్రారంభం.. వేసవి సెలవుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..jagan moham reddy;amala akkineni;jagan;amaravati;andhra pradesh;marchSun, 17 Jan 2021 23:56:00 GMTఅమరావతి: కరోనా వల్ల ఇప్పటికే ఏడాదిగా విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. దీంతో వారి చదువు చాలా వరకు కుంటుపడింది. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రాల్లోని పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులు కూడా మళ్లీ పాఠశాలలకు వస్తున్నారు. అయితే మరో రెండు నెలల్లో వేసవి రానుంది. అయితే ఇప్పుడే పాఠశాలలు ప్రారంభమయ్యాయి కనుక వేసవిలో కూడా విద్యార్థులు పాఠశాలలకు రావలసి ఉంటుందనే వార్తల ఈ మధ్య వినిపించాయి. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 


రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. వీరికోసం ప్రత్యేకంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.



సాధారణంగా 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతో కలిపి ప్రతి రోజూ 8 పీరియడ్లు జరుగుతాయి. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ ఈ తరగతులు నిర్వహిస్తారు. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. 



అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి సవరించిన వార్షిక క్యాలెండర్‌ను సైతం ఇంటర్‌ బోర్డు వెలువరించింది. దాని ప్రకారం ఇంటర్మీడియెట్‌కు మొత్తం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నిర్వహించనున్నారు. వేసవి సెలవులను కూడా రద్దు చేయడం జరిగింది. 



ఇక ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వచ్చే ఏడాది అంటే 2021-22 విద్యా సంవత్సరం జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కూడా సోమవారం నుంచి ఆరో తరగతి క్లాసులు ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు వెల్లడించారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు జరుగుతాయని తెలిపారు.




కాశ్మీర్ ప్రశాంతం.. టెర్రరిస్టులు కూడా...

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>