PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/bailey-bridge987d1f4a-075e-479c-8818-c3eec0f4c955-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/bailey-bridge987d1f4a-075e-479c-8818-c3eec0f4c955-415x250-IndiaHerald.jpgజమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలోని కేలా మోర్ వద్ద 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను కేవలం 60 గంటల్లో పూర్తి చేసి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) అరుదైన రికార్డును సృష్టించింది. ఈ జమ్మూ – శ్రీనగర్ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడడంతో జనవరి 10 నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కశ్మీర్‌ లోయకు, దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బెయిలీ వంతెనను బీఆర్ఓ నిర్మించిందిbailey bridge;varun;varun sandesh;varun tej;srinagar;india;ram madhav;telugu;january;research and analysis wing60 గంటల్లో 120 అడుగుల పొడవైన బెయిలీ బ్రిడ్జిని నిర్మించి రికార్డ్ సృష్టించిన బీఆర్వో...60 గంటల్లో 120 అడుగుల పొడవైన బెయిలీ బ్రిడ్జిని నిర్మించి రికార్డ్ సృష్టించిన బీఆర్వో...bailey bridge;varun;varun sandesh;varun tej;srinagar;india;ram madhav;telugu;january;research and analysis wingSun, 17 Jan 2021 12:05:00 GMTజమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలోని కేలా మోర్ వద్ద 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను కేవలం 60 గంటల్లో పూర్తి చేసి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) అరుదైన రికార్డును సృష్టించింది. ఈ జమ్మూ – శ్రీనగర్ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడడంతో జనవరి 10 నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కశ్మీర్‌ లోయకు, దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బెయిలీ వంతెనను బీఆర్ఓ నిర్మించింది. ఇందుకోసం చిన్నపాటి ప్రి-ఫ్యాబ్రికేటెడ్‌ ఉక్కు ఫలకాలను ఉపయోగించారు. ఇక శనివారం నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్టు బీఆర్వో తెలిపింది. కాగా శనివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను వంతెన ద్వారా అనుమతించామని బీఆర్వో చీఫ్ ఇంజినీర్ బ్రిగేడియర్ ఐకే జగ్గీ అన్నారు. కొండచరియలు విరిగిపడటంతో వారం రోజుల కిందట కేలా మోర్ వద్ద వంతెన దెబ్బతింది. వంతెనను మూసివేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజుల్లోనే వంతెనను సిద్ధం చేస్తామని తొలుత బీఆర్వో ప్రకటించింది.




యుద్ధ ప్రాతిపదికన బెయిలీ వంతెన నిర్మించి, శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ రన్ నిర్వహించారు. సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిని ఇచ్చారు. ఇక ఈ వంతెన నిర్మాణంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఊరట లభించింది. అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అభ్యర్థనతోనే బీఆర్వో ఈ వంతెనను నిర్మించింది. ‘జనవరి 14 ఉదయం 7.30 గంటలకు నిర్మాణ పనులు ప్రారంభించారు. లెఫ్టినెంట్ కల్నల్ వరుణ్ ఖేరే నేతృత్వంలోని 99 రోడ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ బృందం ఈ నిర్మాణంలో పాలుపంచుకుంది. ఆరుగురు అధికారులు, 10 మంది సూపర్‌వైజర్లు, 50 మంది వర్కర్లు మొత్తంగా 60 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు వంతెనను అనుకున్న సమయానికి అటుఇటుగా పూర్తిచేశారు’ అని బీఆర్వో తెలిపింది.




ఒకే ఒక్క ఫోటోతో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారుగా ......??

వామ్మో ..... ఒక్కవారం లో ఇంత విధ్వంశమా .....??

అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>