Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/hardik-pandya-and-krunal-pandya-father-dieda579da2f-e224-475c-82e7-111c685b6802-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/hardik-pandya-and-krunal-pandya-father-dieda579da2f-e224-475c-82e7-111c685b6802-415x250-IndiaHerald.jpgటీమిండియా ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యల ఇంట్లో విషాదం నెలకొంది. వారి తండ్రి హిమాన్షు పాండ్యా ఈ రోజు(శనివారం) ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే ఉన్నట్లుండి గుండెపోటు ఆయన బాధపడడంతో కుటుంబ ..hardik pandya;ali;mumbai;virat kohli;cricket;hardik pandya;india;hushaaru;twitter;heart;father;anandamపాండ్యా సోదరుల ఇంట తీవ్ర విషాదం.. ఊహించని విధంగా..పాండ్యా సోదరుల ఇంట తీవ్ర విషాదం.. ఊహించని విధంగా..hardik pandya;ali;mumbai;virat kohli;cricket;hardik pandya;india;hushaaru;twitter;heart;father;anandamSat, 16 Jan 2021 14:13:06 GMTముంబై: టీమిండియా ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యల ఇంట్లో విషాదం నెలకొంది. వారి తండ్రి హిమాన్షు పాండ్యా ఈ రోజు(శనివారం) ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే ఉన్నట్లుండి గుండెపోటు ఆయన బాధపడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు ధృవీకరించారు.

తండ్రి మరణించిన వార్త తెలియగానే కృనాల్‌ పాండ్యా వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. కృనాల్ పాండ్యా ఉన్నట్లుండి టోర్నీ నుంచి నిష్క్రమించడంపై బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో శిశిర్‌ హతంగాడి మాట్లాడుతూ.. కృనాల్‌ పాండ్యా వ్యక్తిగత కారణాల వల్ల బయోబబుల్‌ నుంచి ఇంటికి వెళ్లాడని తెలిపారు. ‘అవును.. కృనాల్ పాండ్యా బయోబబుల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. టోర్నీ నుంచి తప్పుకున్నారు.  ఆయన కుటుంబంలో జరిగిన విషాదం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కృనాల్,  హార్దిక్‌లకు కలిగిన ఈ నష్టం తీర్చలేనిది. దీనిపై బరోడా క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేస్తోంది’ అంటూ శిశిర్ పేర్కొన్నారు.

ఇక హార్దిక్ పాండ్యా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ టోర్నీలో ఆడాడు. ఆ తరువాత భారత్ తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌కు కఠిన శిక్షణ పొందుతున్నాడు. అయితే తండ్రి మరణవార్తతో పాండ్యా సోదరులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

వార్త తెలుసుకున్న వెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తదితర క్రికెటర్లు కూడా పాండ్యా సోదరుల తండ్రి మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే గుండె పగిలినంత పనైందని, ఎంతో హుషారుగా, ఆనందంగా ఉండే వ్యక్తి ఇలా అనుకోకుండా దూరం కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కోహ్లీ ట్వీట్ చేయగా, పాండ్యా సోదరుల తండ్రి మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని, వారి కోసం ఆయనెంతో ఆలోచించేవారని, పరిస్థితులను తట్టుకునే శక్తిని వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.

">




నమ్రతను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అని మహేష్ బాబు ని బెదిరించింది ఎవరు...?

ఏపీ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి

ట్రంప్ మరో అపఖ్యాతి !

భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?

నమ్రత పెట్టిన పోస్టు చూసి హర్ట్ అయిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

జర్నలిస్టులపై మాటల దాడి చేసిన సీఎం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>