Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fire-accidenta303cd0d-ace8-4eb8-bed8-a34b5912c332-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fire-accidenta303cd0d-ace8-4eb8-bed8-a34b5912c332-415x250-IndiaHerald.jpgఒక్కోసారి మనుషులు చేసే చిన్న చిన్న తప్పులే భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తాయి. ప్రాణాలను సైతం తీసేస్తాయి. అది చిన్న తప్పేనని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, దానివల్ల సంభవించే ప్రమాదాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల ..fire accident;manu;renu desai;district;police;adilabadచలిమంటే చివరి మంటగా.. వృద్ధురాలితో సహా..చలిమంటే చివరి మంటగా.. వృద్ధురాలితో సహా..fire accident;manu;renu desai;district;police;adilabadSat, 16 Jan 2021 11:25:44 GMTఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి మనుషులు చేసే చిన్న చిన్న తప్పులే భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తాయి. ప్రాణాలను సైతం తీసేస్తాయి. అది చిన్న తప్పేనని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, దానివల్ల సంభవించే ప్రమాదాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల తీవ్ర పరిణామాలను, ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. అలాంటి ఓ సంఘటనే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.   

అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన రేణుకాబాయి అనే 70 సంవత్సరాల వృద్ధురాలు ఈరోజు ఉదయం అగ్న ప్రమాదంలో మరణించింది. ఆమెతో పాటు ఆమె ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. అయితే ఆమె ప్రాణాలను సైతం తీసిన ఆ అగ్నికి కారణం ఏంటో తెలుసా.. చలి కాచుకునేందుకు ఆమె వేసిన చలిమంట. అవును ఉదయాన్నే చలి ఎక్కువగా ఉండడంతో దానినుంచి రక్షణ కోసం రేణుకాబాయి చలిమంట వేసుకుంది. అయితే ఆ కుంపటి ప్రమాదవశాత్తూ గుడిసెకు అంటుకుంది.   

ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన రేణుకాబాయి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో ఆమెకు కూడా నిప్పంటుకుంది. వెంటనే అక్కడి నుంచి బయపడాలని ప్రయత్నించినా.. అప్పటికే మంటలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమెను కూడా దహించివేశాయి. ఆమె పెద్దపెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిచినా ఫలితం లేకపోయింది.

ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న 15 క్వింటాళ్ల పత్తి కూడా దగ్ధమైంది. పత్తి ఉండడంతో నిప్పు త్వరగా అంటుకున్నట్లు దర్యాప్తు చేసిన పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇలాంటి ప్రమాదాలను చూస్తే మనిషికి చావు ఎలా వస్తుంది..? ఎప్పుడు వస్తుంది..? అనేది తెలుసుకోవడం అసాధ్యం అనే మాట నిజమనే అనిపిస్తుంది.





దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!

కంగారు పడకండి.. వ్యాక్సిన్ వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..?

అర్జంటుగా తిరుపతికి పవన్... కూటమిలో ఏం జరుగుతోంది...?

ఒక్కో ఎమ్మెల్యేల‌కు రు.25 కోట్లు... అంద‌రిని త‌న వైపుకే తిప్పుకున్న సీఎం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>