HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/egg-hen-helth695b3ac7-36b0-4432-a873-70d29826fc6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/egg-hen-helth695b3ac7-36b0-4432-a873-70d29826fc6c-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాల ప్రజలందరినీ కరోనా మహమ్మారి ఒకవైపు వణికించేస్తుంటే,మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రజలందరూ బర్డ్ ఫ్లూ గురించి తెలిసినప్పటినుంచి చికెన్, కోడి గుడ్లు తినడానికి భయపడుతున్నారు. ఎవరో ఒకరు సృష్టించిన రూమర్ కారణంగా ప్రజలంతా వీటిని తినాలంటే తీవ్ర భయాందోళనలకు గురి కావడం గమనార్హం. అయితే, నిజంగానే గుడ్లు,చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా? అనే విషయంపై ముంబైలోని అనిమల్ అండ్ బర్డ్ హాస్పిటల్, ముంబై సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టుegg,hen,helth;health;manu;mumbai;chicken;doctor;nijamచికెన్,గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని భయపడుతున్నారా?అయితే ఇది మీ కోసమే.చికెన్,గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని భయపడుతున్నారా?అయితే ఇది మీ కోసమే.egg,hen,helth;health;manu;mumbai;chicken;doctor;nijamSat, 16 Jan 2021 10:38:30 GMTప్రపంచ దేశాల ప్రజలందరినీ కరోనా మహమ్మారి ఒకవైపు వణికించేస్తుంటే,మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాపించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రజలందరూ బర్డ్ ఫ్లూ  గురించి తెలిసినప్పటినుంచి చికెన్, కోడి గుడ్లు తినడానికి భయపడుతున్నారు. ఎవరో ఒకరు సృష్టించిన రూమర్ కారణంగా ప్రజలంతా వీటిని తినాలంటే తీవ్ర భయాందోళనలకు గురి కావడం గమనార్హం. అయితే, నిజంగానే గుడ్లు,చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ  వస్తుందా?  అనే విషయంపై ముంబైలోని అనిమల్ అండ్ బర్డ్  హాస్పిటల్, ముంబై సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ  టు అనిమల్స్ (BSPCA) ఇన్చార్జ్ డాక్టర్ మయూర్ దంగర్మ మాట్లాడుతూ.. " బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ H5N1 కారణంగా ఏర్పడుతుంది.  ఈ వైరస్ ని చంపడానికి 70 డిగ్రీల సెల్సియస్ వేడి అవసరమవుతుంది. కాబట్టి చికెన్, గుడ్లు ఉడికించేటప్పుడు 70 డిగ్రీల సెల్సియస్ వద్ద మాంసాన్ని వండడం మంచిది.  70 డిగ్రీల వేడి వద్ద చికెన్ లేదా గుడ్లని ఉడికించినప్పుడు అందులో ఉండే H5N1 వైరస్ చనిపోతుంది. ఇక గుడ్లు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని" ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం కోళ్ల పెంపకంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ  నియంత్రణపై డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు జరిపింది. H5N1అనే వైరస్ పక్షి జాతులలో ఒక పక్షి నుండి మరొక పక్షికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వైరస్ ముఖ్యంగా బాతులు,కోళ్ళు వంటి పక్షి జాతులకు  ఎక్కువగా విస్తరిస్తుంది. కానీ పక్షి నుంచి మనిషికి మాత్రం ఈ వైరస్ సోకదు. కేవలం సగం వండిన గుడ్లు లేదా చికెన్ తినడం వల్లే బర్డ్ ఫ్లూ సోకే  ప్రమాదం ఉంది. అందుకే చికెన్,బాతులు లాంటి పెద్ద పక్షి జాతికి చెందిన పెద్ద బాతులను 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ వేడి వద్ద ఉడికించాలి. పౌల్ట్రీ లో వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ను చంపడానికి ఇది సురక్షితమైన చర్య అని స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్ఓ.

అయితే ప్రధానంగా H5N1 వైరస్ సోకిన పక్షులకు సమీపంలో ఎక్కువసేపు గడిపిన మనుషులకు ఈ వైరస్ సోకుతుందని WHO  పేర్కొంది. కానీ ఈ వైరస్ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యు.హెచ్.ఓ) సంస్థ స్పష్టం చేసింది.


దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!

కంగారు పడకండి.. వ్యాక్సిన్ వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..?

అర్జంటుగా తిరుపతికి పవన్... కూటమిలో ఏం జరుగుతోంది...?

ఒక్కో ఎమ్మెల్యేల‌కు రు.25 కోట్లు... అంద‌రిని త‌న వైపుకే తిప్పుకున్న సీఎం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>