Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/weight-loss5295b14f-670c-4426-8ac9-c98df6284851-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/weight-loss5295b14f-670c-4426-8ac9-c98df6284851-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటో తెలుసా..? అధిక బరువు. ఈ సమస్యతో బాధపడుతున్న కోట్ల మందిలో లక్షల మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అనవసరమైన సమయంలో తినడం, అవసరమైన సమయంలో నిద్రపోకపోవడం, ఉరుకుల పరుగుల జీవనం వల్ల..weight loss;vitamin;turmeric;cholesterol;paruguఈ జ్యూస్ రోజూ తాగితే నాజూకుదనం మీ సొంతం.. నమ్మండి..!ఈ జ్యూస్ రోజూ తాగితే నాజూకుదనం మీ సొంతం.. నమ్మండి..!weight loss;vitamin;turmeric;cholesterol;paruguSat, 16 Jan 2021 10:07:20 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటో తెలుసా..? అధిక బరువు. ఈ సమస్యతో బాధపడుతున్న కోట్ల మందిలో లక్షల మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అనవసరమైన సమయంలో తినడం, అవసరమైన సమయంలో నిద్రపోకపోవడం, ఉరుకుల పరుగుల జీవనం వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే ఒకసారి ఊబకాయం బారిన పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. విపరీతమైన వ్యాయామాలు, ఆహారం విషయంలో కఠిన నియమాలు మాత్రమే ఊబకాయం నుంచి బయటపడేస్తాయనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అయితే ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ బరువు తగ్గించుకునేందుకు కొన్ని సులభ మార్గాలు కూడా ఉన్నాయి. మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోకుండానే కొన్ని నియమాలు పాటించడం, చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఊబకాయం నుంచి బయపటడవచ్చు. అందులో ఒకటి పసుపు-నిమ్మ జ్యూస్.

నిమ్మరసంలో పసుపు కలపి ఓ డ్రింక్‌లా చేసుకుని తాగితే కచ్చితంగా అధికబరువును తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం, ప‌సుపు వేసి బాగా క‌లిపి వేడి తగ్గకముందే తాగాలి. ఈ డ్రింక్ ప్ర‌తి రోజు తాగడం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కొవ్వు క‌రుగిపోతుంది. నిమ్మర‌సంలో ఉండే విటమిన్-సీ, ఫైబర్‌తోపాటు పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా శరీరం శక్తికోసం కొవ్వును వినియోగించుకుంటుంది. అలాగే నిమ్మ‌రసం, ప‌సుపు క‌లిపిన డ్రింక్ తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. దీనివల్ల అనేక వైర‌స్‌లు, ఇన్ఫెక్షన్ల నుంచి మనలను మనం కాపాడుకోవచ్చు.

అంతేకాదు ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో అలసట‌, డిప్రెషన్ వంటి స‌మ‌స్య‌లు కూడా దూరమవుతాయి. కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ డ్రింక్ మెరుగైన పనితనం చూపిస్తుంది. మ‌ధుమేహం వ‌చ్చే ప్ర‌మాదం నుంచి కూడా ఈ జ్యూస్ కాపాడుతుంది. కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారే కాదు. అంద‌రూ ఈ అద్భుతమైన డ్రింక్‌ను తీసుకోవ‌చ్చు. అనేక ప్రయోజనాలను పొందచ్చు. ఇది మాత్రమే కాదు ఈ డ్రింక్‌ను ప్ర‌తి రోజు తీసుకోవడం వల్ల ప్రాణాంత‌కమైన క్యాన్స‌ర్ నుంచి కూడా రక్షణ పొందవచ్చట. క్యాన్సర్‌ కారకాలైన క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా ఇది యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది.





చలిమంట.. చితిమంట అయ్యింది.. ఏం జరిగిందంటే..?

వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..!?

బీజేపీతో పొత్తు.. 21న తేలిపోతుందా ? జ‌న‌సేన‌లో హాట్ టాపిక్‌..!

ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>