PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హైందవమతంపై దాడులకు సంబంధించిన ప్రస్తావనలో దోషులను అరెస్ట్ చేసినట్లు చెప్పిన డీజీపీ, పార్టీల ప్రమేయం ఉందని చెప్పడం రాష్ట్రప్రజానీకాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది అని అన్నారు. డీజీపీ ఏ సమాచారంతో మీడియా వారితో మాట్లాడారు? అని నిలదీశారు. సీఐడీ, సిట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. 13 వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏ పారdgp;chakravarthy;praveen;ramu;tara;media;minister;arrest;tdp;news;rama tirtha;reddy;varla ramaiah;sajjala ramakrishna reddyడీజీపీకి స్పీచ్ అక్కడి నుంచే వచ్చిందా...?డీజీపీకి స్పీచ్ అక్కడి నుంచే వచ్చిందా...?dgp;chakravarthy;praveen;ramu;tara;media;minister;arrest;tdp;news;rama tirtha;reddy;varla ramaiah;sajjala ramakrishna reddySat, 16 Jan 2021 19:00:00 GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హైందవమతంపై దాడులకు సంబంధించిన ప్రస్తావనలో దోషులను  అరెస్ట్ చేసినట్లు చెప్పిన డీజీపీ, పార్టీల ప్రమేయం ఉందని చెప్పడం రాష్ట్రప్రజానీకాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది అని అన్నారు. డీజీపీ ఏ సమాచారంతో మీడియా వారితో మాట్లాడారు?  అని నిలదీశారు. సీఐడీ, సిట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.

13 వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి, 15వ తేదీన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు సంబంధించినవారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటు అని ఆయన ఆరోపించారు. ఏ డీజీపీ కూడా మాట్లాడని విధంగా ఆయన అధికారపార్టికి వత్తాసుపలుకుతూ దిగజారి మాట్లాడారు అని మండిపడ్డారు. ఆంజనేయస్వామి విగ్రహం చేతిని విరగ్గొట్టినవారు, రథాలు తగలబెట్టినవారు, రామతీర్థంలో రాముని తల పగలగొట్టినవారి సంగతేమిటో డీజీపీ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

హైందవమతాన్ని కించపరుస్తూ, ఆంజనేయస్వామి విగ్రహంచేయి విరిగితే ఏమవుతుంది... రాముడి తల తెగితే రక్తమొస్తుందా అంటూ అవహేళనగా మాట్లాడిన బూతుల మంత్రి కొడాలినానీ, డీజీపీకి నేరస్తుడిలా కనిపించలేదా? అని నిలదీశారు. కర్నూలు జిల్లాలోని ఓంకారక్షేత్రంలో  అర్చకులను చర్నాకోలుతో చావబాదిన ప్రతాపరెడ్డిని డీజీపీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు. ఆంజేయస్వామి దేవాలయాన్ని జేసీబీతో కూల్చేసిన దామోదర్ రెడ్డి, డీజీపీ ప్రకటించిన హిందూద్రోహుల జాబితాలో ఎందుకు లేడు? అని ప్రశ్నించారు. వైసీపీవారిని వదిలేసి, దోషులను పట్టుకున్నామని, రాజకీయపార్టీలప్రమేయం ఉందని డీజీపీ ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తనకు తానే హిందూ దేవాలయాలపై దాడిచేశానని, విగ్రహాలను ధ్వంసం చేశానని, 699 గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని చెబితే, డీజీపీ అతన్ని ఎందుకు మీడియాముందు ప్రవేశపెట్టలేదు అని ప్రశ్నించారు. డీజీపీ వ్యాఖ్యలను, ఆయన విధినిర్వహణ తీరుని ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సమర్థించదు అని అన్నారు.


కేవలం చెప్పులు వేసుకుంటే చాలు లక్షల్లో జీతం!

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!

మెగాహీరోకి విలన్ గా విజయ్ సేతుపతి

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

చిక్కుల్లో యడియూరప్ప..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>