HealthSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vaccine7a5046dd-1c3a-4156-a60a-262c0918861f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vaccine7a5046dd-1c3a-4156-a60a-262c0918861f-415x250-IndiaHerald.jpgఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలై.. అంతే ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. వ్యాక్సినేషన్ తరువాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు యోచించారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ కేంద్రాల్లోనే చికిత్స యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు. vaccine;health;ktr;hyderabad;jagan;andhra pradesh;telangana;narendra modi;prime minister;director;minister;central government;mantraఊపిరి పీల్చుకున్న తెలుగు రాష్ర్టాలు.. ప్రశాంతంగా ముగిసిన వ్యాక్సినేషన్ఊపిరి పీల్చుకున్న తెలుగు రాష్ర్టాలు.. ప్రశాంతంగా ముగిసిన వ్యాక్సినేషన్vaccine;health;ktr;hyderabad;jagan;andhra pradesh;telangana;narendra modi;prime minister;director;minister;central government;mantraSat, 16 Jan 2021 18:33:04 GMTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలై.. అంతే ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. వ్యాక్సినేషన్ తరువాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు యోచించారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ కేంద్రాల్లోనే చికిత్స యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు. మరో పక్క నార్వేలో వ్యాక్సినేషన్ లో 23 మంది చనిపోయారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆత్మస్థైర్యంతో తెలుగు ప్రజలు ముందుకు సాగారు. 18 యేళ్ల లోపు వారికి, గర్భిణులకు, జర్వంతో  ఉన్నవారికి వ్యాక్సిన్ వేయకుండా కేంద్రం ఆదేశాల మేరకు జాగ్రత్తలు చేపట్టారు. 
                            వ్యాక్సినేషన్ వల్ల ప్రజల్లో ఎటువంటి భయాలు, అపోహలు లేకుండా ఉండేందుకు ప్రధాని మోదీ నుంచి ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు అందరూ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వ్యాక్సిన్ కేంద్రాల్లో దగ్గరుండి మరీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ను ప్రారంభించడం విశేషం. ముందుగా పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తూ కేంద్రం ఆదేశాలను ఇరు ప్రభుత్వాలు పాటించాయి. హైదరాబాద్ వరకు 1,330 మందికి వ్యాక్సిన్ వేయగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3530 మందికి టీకా వేసినట్లు తెలంగాణ రాష్ర్ట హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ర్టంలో ఏర్పాటుచేసిన 140 సెంటర్లలో 30 చొప్పున వ్యాక్సిన్ లు వేసినట్లు వివరించారు. వ్యాక్సినేషన్ లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ కోసం తమ సిబ్బంది రెండు నెలలు కష్టపడ్డారని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ మొదటి వారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన వారికి, రెండో వారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి కూడా అందిస్తామని ఇరు రాష్ర్టాల వైద్యాధికారులు చెబుతున్నారు. 
                      ఏపీలోనూ విజయవంతంగా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిసింది. మొత్తంగా 332 కేంద్రాలలో వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరిద్దరికి లైట్ గా జ్వరం, దురదలు వచ్చాయి. మిగిలిన వారికి ఏ విధమైన ఇబ్బందులు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. మొత్తానికి మొదటి రోజు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో ఇరు రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. 


కేవలం చెప్పులు వేసుకుంటే చాలు లక్షల్లో జీతం!

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!

మెగాహీరోకి విలన్ గా విజయ్ సేతుపతి

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

చిక్కుల్లో యడియూరప్ప..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>