MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8558ac3c-3f7f-4313-a44b-6c7a9a53f3cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8558ac3c-3f7f-4313-a44b-6c7a9a53f3cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో రామ్ ఒకడు. గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిపోయాయి. దీంతో పెళ్లి కాని హీరో హీరోయిన్లను ఎవరు ఇంటర్వ్యూ చేసినా.. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.ram;ram pothineni;shankar;trivikram srinivas;cinema;marriage;ismart shankar;blockbuster hit;hero;success;krack;redపెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరోపెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరోram;ram pothineni;shankar;trivikram srinivas;cinema;marriage;ismart shankar;blockbuster hit;hero;success;krack;redSat, 16 Jan 2021 20:43:24 GMTహీరో రామ్ ఒకడు. గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిపోయాయి. దీంతో పెళ్లి కాని హీరో హీరోయిన్లను ఎవరు ఇంటర్వ్యూ చేసినా.. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం హీరో రామ్ వయస్సు 32 సంఫత్సరాలు. తాజాగా విడుదలైన ఆయన రెడ్ సినిమా కోసం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో రామ్‌ను కూడా చాలా మంది పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు బాగా అడుగుతున్నారు. అయితే రామ్ మాత్రం ఇతర హీరో హీరోయిన్లు చెప్పే మాటలకు భిన్నంగా “పెళ్లి మన చేతిలో ఉండదు. పెళ్లి తర్వాత ఏదీ మన చేతిలో ఉండదు” అంటూ చమత్కారంగా సమాధానం ఇస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు పెళ్లి అదే జరిగి పోతుందని చెప్పేశారు. అయితే రామ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్.. ఈ ఏడాది రెడ్ సినిమాతో మరో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వచ్చినట్లే ‘రెడ్’ సినిమాకు కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. అయితే టాక్ పాజిటివ్ గా లేకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం రామ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాకు తొలిరోజే ఏకంగా 6.7 కోట్ల రూపాయల షేర్ దక్కింది. బాక్సాఫీస్ దగ్గర క్రాక్ మినహా మిగతా సినిమాలేవీ పోటీ ఇవ్వకపోవడం కూడా రెడ్ చిత్రానికి కలిసొచ్చింది. దీంతొ రెడ్ మూవీకి కలెక్షన్లు బాగా వస్తున్నాయి.

ఈ క్రమంలో మరో ఇంటర్య్వూలో కూడా రామ్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు. ‘మీ సీతను ఎప్పుడు పరిచయం చేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘నాకు పరిచయం అయిన వెంటనే చేస్తానని’ రామ్ బదులిచ్చారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న రామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వస్తన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.


మాస్టర్ నిజంగా బాలీవుడ్ కి వెళుతుందా?

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!

మెగాహీరోకి విలన్ గా విజయ్ సేతుపతి

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

చిక్కుల్లో యడియూరప్ప..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>