PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gangulya30b2099-9219-4e6e-b7b2-05c8311e1644-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gangulya30b2099-9219-4e6e-b7b2-05c8311e1644-415x250-IndiaHerald.jpgసౌరవ్‌ గంగూలీ.. ఈ పేరు తెలియని క్రీడాభిమానులు చాలా అరుదు.. ఆయన వయస్సు 50 ఏళ్లలోపే.. సరిగ్గా చెప్పాలంటే 48 ఏళ్లు.. ఆయన మంచి క్రీడాకారుడు అన్న సంగతి తెలిసిందే. అప్పుడే కాదు.. ఇప్పుడూ ఆయన రోజూ ఇంట్లో జిమ్‌లో వ్యాయామం చేస్తాడు. మనిషిని చూస్తే ఇంకా 40 ఏళ్ల వయస్సులే ఉన్నంత స్మార్ట్ గా కనిపిస్తాడు.. అయితే ఆయనకు ఇటీవల గుండెనొప్పి వచ్చిన సంగతి తెలిసిందే. గుండె నొప్పి నుంచి కొద్ది రోజుల్లోనే ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. అసలు విషయం ఆయన కోలుకోవడం గురించి కాదు.. అసలు ఆయనకు ఎందుకు గుండెనొప్పి వచganguly;tara;bari;heartఫిట్‌గా ఉండే గంగూలీకి గుండెపోటు ఎందుకు వచ్చిందో తెలిస్తే షాకవుతారు..!?ఫిట్‌గా ఉండే గంగూలీకి గుండెపోటు ఎందుకు వచ్చిందో తెలిస్తే షాకవుతారు..!?ganguly;tara;bari;heartSat, 16 Jan 2021 07:00:00 GMTగుండె నొప్పి నుంచి కొద్ది రోజుల్లోనే ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అయితే.. అసలు విషయం ఆయన కోలుకోవడం గురించి కాదు.. అసలు ఆయనకు ఎందుకు గుండెనొప్పి వచ్చిందనేదే.. అంత పర్‌ఫెక్టుగా ఉండే అతనికే గుండెనొప్పి వస్తే.. ఇతరుల సంగతేంటి.. అసలు ఏ వయస్సు వారికి గుండెనొప్పి వస్తుంది..ఎలాంటి అలవాట్లు ఉండే గుండెనొప్పి వస్తుంది. గంగూలీకి ఎందుకు వచ్చింది.. ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. గుండె జబ్బులు వంశపారంపర్యంగా కూడా వస్తాయి.

అవును.. నిజమే.. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బులు గలవారు ఉంటే.. వారికీ గుండె నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు దీర్ఘకాలంగా ఒత్తిడి, ఇతరత్రా అంశాలూ ఆ ముప్పును తెచ్చిపెడతాయి. వంశపారంపర్యంగా రకరకాల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒక జన్యువు లేదా కొన్ని జన్యుమార్పులతోనే కొన్ని జబ్బులు రావొచ్చు కూడా. కొందరికి వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉంటుండొచ్చు. అందువల్ల  గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు త్వరగా దెబ్బతింటాయి. పూడికలు ఏర్పడేలా చేస్తాయి.

అందుకే.. జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాం కదా. మనకెందుకు గుండెజబ్బులు వస్తాయి? అని అస్సలు అనుకోకూడదు. శారీరకశ్రమ, వ్యాయామం, ఆటలు శరీర సామర్థ్యాన్ని ఇనుమడింపజేసినా గుండె జబ్బులు రావని గ్యారంటీ ఏమీ లేదు. వీటి బారి నుంచి కాపాడుకోవాలంటే.. 40 ఏళ్లు దాటిన దగ్గరనుంచి అప్పుడప్పుడు గుండె పరీక్షలు చేయించుకోవాలి. 


సంక్రాంతి పోరు లో ఎవరు గెలిచినట్లు..?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>