HealthChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health5cfe7d3d-c13c-41fe-8f94-4bb970c1a04b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health5cfe7d3d-c13c-41fe-8f94-4bb970c1a04b-415x250-IndiaHerald.jpgకాలం మారుతున్న కొద్దీ ప్రాణాలకూ గ్యారంటీ తగ్గుతోంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చిన్న వయస్సులోనే వింత వింత జబ్బులు వస్తున్నాయి. వైద్యంలోనాణ్యత పెరుగుతున్నా.. ఆరోగ్యం ప్రమాణాలు పడిపోతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్లు దాటిన వారికే అనుకునేవారు.. కానీ ఇప్పుడు నిండా 30 ఏళ్లు లేని వారికి కూడా గుండెపోటు వస్తోంది. ఇక 50 దాటితే ఎప్పుడు ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేకుండా పోయింది. ఇటీవల భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ట్రెడ్‌మిల్‌ మీద వ్యాయామం చేస్తూ గుండెపోటుకుhealth;cholesterol;v40 ఏళ్లు దాటాయా.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం..!40 ఏళ్లు దాటాయా.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం..!health;cholesterol;vSat, 16 Jan 2021 23:00:00 GMT
ఇటీవల భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ట్రెడ్‌మిల్‌ మీద వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వయసు మరీ పెద్దదేమీ కాదు. అందుకే శరీరం ఫిట్‌గా ఉంది కదా.. మాకు గుండెజబ్బు రాదు అనుకోవడానికి లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ.. 45 ఏళ్లు దాటిన తర్వాత గుండెజబ్బు ముప్పు పెరుగుతుంది. అందుకే వ్యాయామం చేస్తున్నా, ఆటలు ఆడుతున్నా మధ్యవయసులో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం తప్పనిసరి. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ గలవారికి.. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బుల గలవారికిది తప్పనిసరి.

అధిక కొలెస్ట్రాల్‌ గలవారికి.. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బుల గలవారికిది తప్పనిసరి ఎందుకంటే.. రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండేవారిలో శరీరం అదనపు కొవ్వును బయటకు వెళ్లగొట్టలేదు. అందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరుగుతూ వస్తుంటాయి. ఇది రక్తనాళాల లోపలి గోడల్లో పోగుపడుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పోగుపడి, పూడికలు ఏర్పడతాయి.. రక్తనాళాల లోపలి మార్గం సన్నగా మారుతుంది.

ఈ పూడికల సైజు పెరుగుతున్నకొద్దీ గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫైనల్‌ గా ఇది గుండెనొప్పికి దారితీస్తుంది. ఆ తర్వాత గుండెపోటు వస్తుంది.. ఒక్కోసారి గుండెనొప్పి వంటి లక్షణాలేవీ లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటూ రావొచ్చు. అందుకే 40 ఏళ్లు దాటినవారు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడినవారు కనీసం ఏడాదికి ఒకసారైనా ఈ పరీక్షను చేయించుకోవాలి.


'రెడ్' సినిమా సక్సెస్ మీట్ లో హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్న హీరో రామ్...

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>