LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hole-grainsc5692705-44b0-4a52-902b-14fdf02753ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hole-grainsc5692705-44b0-4a52-902b-14fdf02753ed-415x250-IndiaHerald.jpgచిరు ధాన్యాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి.. కానీ వల్ల మానవ శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు, లవణాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. బిపి, షుగర్ ఉన్న ఎక్కువగా ఈ చిరు ధాన్యాలను తింటారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఎక్కువగా వీటినే తీసుకుంటారు. ఈ చిరు ధాన్యాలు ఆరోగ్యానికే కాకుండా స్థూలకాయులు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి. అందుకే రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం చాలామంది వంటిళ్లలో దర్శనమిస్తున్నాయి. hole grains;chiranjeevi;raaga;calcium;bp;sugar;ayurveda;cholesterolచూడటానికి ఇవి చాలా చిన్నవే.. వీటిలో పోషకాలు మాత్రం చాలా ఎక్కువే..చూడటానికి ఇవి చాలా చిన్నవే.. వీటిలో పోషకాలు మాత్రం చాలా ఎక్కువే..hole grains;chiranjeevi;raaga;calcium;bp;sugar;ayurveda;cholesterolSat, 16 Jan 2021 19:13:40 GMTబిపి, షుగర్ ఉన్న ఎక్కువగా ఈ చిరు ధాన్యాలను తింటారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఎక్కువగా వీటినే తీసుకుంటారు. ఈ చిరు ధాన్యాలు ఆరోగ్యానికే కాకుండా స్థూలకాయులు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి. అందుకే రాగులు, సజ్జల వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం చాలామంది వంటిళ్లలో దర్శనమిస్తున్నాయి.



ప్రొటీన్లు, ఫైబర్‌, విటమిన్‌లు, ఖనిజాల వంటి అత్యవసర పోషకాలెన్నో ఈ చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేగాక వీటిలో మేలురకం పిండి పదార్థాలు ఉండటంవల్ల జీర్ణక్రియ సక్రమంగా అవ్వడానికి కూడా ఈ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. అందుకే అధిక బరువును కూడా అదుపులో ఉంచుతుంది. ఎముకల బలానికి కూడా ఈ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు ఎముకల పుష్టికి కూడా తోడ్పడతాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గటానికి దోహదం చేస్తాయి.


ఈ ధాన్యాలను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు..


సజ్జల్లో ఫాస్ఫరస్‌ శాతం ఎక్కువ. ఇది క్యాల్షియంతో కలిసి ఎముకలు బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 296 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్‌ ఉంటాయి.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల రాగుల్లో 244 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అందువల్ల ఎముకలు క్షీణించటం, ఎముకలు విరిగిపోయే ముప్పు తగ్గుతుంది.

అందుకే రాగులు, సజ్జలను ఆహారంలో విధిగా చేర్చుకోవటం మంచిదని ఆయుర్వేద వైద్యులు వెల్లడించారు. రాగి, సజ్జ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. రాగులు జావ కాచుకొని తాగొచ్చు. రాగి జావలో కొంచెం బెల్లం కలిపితే చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడతారు.m


చూసారుగా చిన్నగా ఉన్న ఈ ధాన్యాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..




ముద్రగడ మెత్తబడతారా ? బీజేపీ లోకి వచ్చేస్తున్నట్టేగా ?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>