MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-and-monaleffd4e98-b6c2-44cd-aad4-bb0a3d0c61b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-and-monaleffd4e98-b6c2-44cd-aad4-bb0a3d0c61b0-415x250-IndiaHerald.jpg"సుడిగాడు" చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన మోనాల్ గజ్జర్ ఆ తరువాత "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి"లో కూడా తళుక్కుమంది. కానీ, ఈ గుజరాతీ భామకు టాలీవుడ్ లో తగినంత గుర్తింపు లభించలేదు. చాలా కాలం గ్యాప్ తరువాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సుందరి. భాష రాకపోయినా తెలుగుపై మక్కువతో ఆడియెన్స్ ను అలరించాలన్న దృఢసంకల్పంతో హౌస్ ఎలా ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని కొనసాగింది. త్రుటిలో టాప్ 5లో ఉండే ఛాన్స్ ను మిస్సయింది. abhijeet and monal;naresh;nagarjuna akkineni;abhijith;allari naresh;bhama;monal gajjar;tollywood;cinema;telugu;bigboss;jaggery;gujarathi;house;allari;chitram"అభిజిత్ ఆ మాట అన్నందుకు షాకయ్యా" - మోనాల్"అభిజిత్ ఆ మాట అన్నందుకు షాకయ్యా" - మోనాల్abhijeet and monal;naresh;nagarjuna akkineni;abhijith;allari naresh;bhama;monal gajjar;tollywood;cinema;telugu;bigboss;jaggery;gujarathi;house;allari;chitramSat, 16 Jan 2021 17:13:34 GMTఅల్లరి నరేష్ సరసన నటించిన మోనాల్ గజ్జర్ ఆ తరువాత "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి"లో కూడా తళుక్కుమంది. కానీ, ఈ గుజరాతీ భామకు టాలీవుడ్ లో తగినంత గుర్తింపు లభించలేదు. చాలా కాలం గ్యాప్ తరువాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సుందరి. భాష రాకపోయినా తెలుగుపై మక్కువతో ఆడియెన్స్ ను అలరించాలన్న దృఢసంకల్పంతో హౌస్ ఎలా ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని కొనసాగింది. త్రుటిలో టాప్ 5లో ఉండే ఛాన్స్ ను మిస్సయింది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఓ స్ట్రాటజీతోనే ఎంటరయ్యాయని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నవాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా రావన్న టాక్ నడుస్తోంది. అటువంటి టాక్ ను బ్రేక్ చేయాలని హౌస్ లోకి ఎంటరైందట ఈ భామ. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినవారికి కూడా ఛాన్సెస్ వస్తాయని నిరూపించడం తన మొదటి కర్తవ్యమని అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చింది. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేస్తోంది కూడా.

బుల్లితెరలో వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంది. డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. జడ్జ్మెంట్ ను వీర లెవెల్లో ఇచ్చిపడేస్తోంది. అలాగే, బెల్లంకొండ సినిమాలో ఐటెం సాంగ్ లో దుమ్మురేపింది. సినిమాకి టాక్ ఎలా వచ్చినా మోనాల్ ఐటెం సాంగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటానని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకొస్తోంది.

ఇదిలా ఉంటే, రీసెంట్ గా ఒకానొక సందర్భంలో తన ఎలిమినేషన్ కి గల కారణాన్ని వివరించింది. మెహబూబ్ ఎలిమినేషన్ సందర్భంగా అభిజిత్ ను హోస్ట్ నాగార్జున 'ఈ వారం మెహబూబ్ ప్లేస్ లో ఎవరుంటారని ఎక్స్పెక్ట్ చేశావు' అని ప్రశ్నించాడు. అప్పుడు అభిజిత్ ఏ మాత్రం తడుముకోకుండా 'మోనాల్' అని సమాధానం చెప్పాడు. అభిజిత్ ఇలా సమాధానం చెప్పడం వల్ల తన ఎలిమినేషన్ జరిగి ఉండవచ్చని. ఆడియెన్స్ కు ఈ విధంగా అభిజిత్ ఫీడ్ చేశాడని తన అనాలిసిస్ ను చెప్పుకొచ్చింది గుజరాతీ భామ. మొత్తమ్మీద, టాప్ 5లో ఉండకపోయినా అంతకు మించి బంపర్ ఆఫర్స్ ను పొందడంలో ముందుంటోంది ఈ ముద్దుగుమ్మ.


నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>