Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/sobhan-babu34924746-da04-4451-8ecf-6fcb98d2190e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/sobhan-babu34924746-da04-4451-8ecf-6fcb98d2190e-415x250-IndiaHerald.jpgసోగ్గాడిగా తెలుగు తెరపై ఎప్పటికీ నిచిపోయే నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో శోభన్‌బాబు. ఫ్యామిలీ సినిమాలకు పెట్టిన పేరు శోభన్‌బాబు. అప్పటి వనితల హృదయాల్లో అందగాడిగా, సోగ్గాడిగా ముద్ర వేసి వారి కలల రాకుమారుడిగా మారాడు. అంతేకాదు అలా సోగ్గాడిగానే తాను ప్రేక్షకులకు గుర్తిండిపోవాలని..sobhan babu;business;cbn;editor mohan;sobhan babu;korea, south;cinema;interview;chennai;hero;cinema tickets;shoban babuశోభన్‌‌బాబుకు చనిపోయే సమయానికి అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా..?శోభన్‌‌బాబుకు చనిపోయే సమయానికి అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా..?sobhan babu;business;cbn;editor mohan;sobhan babu;korea, south;cinema;interview;chennai;hero;cinema tickets;shoban babuSat, 16 Jan 2021 11:55:00 GMTఇంటర్నెట్ డెస్క్: సోగ్గాడిగా తెలుగు తెరపై ఎప్పటికీ నిచిపోయే నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో శోభన్‌బాబు. ఫ్యామిలీ సినిమాలకు పెట్టిన పేరు శోభన్‌బాబు. అప్పటి వనితల హృదయాల్లో అందగాడిగా, సోగ్గాడిగా ముద్ర వేసి వారి కలల రాకుమారుడిగా మారాడు. అంతేకాదు అలా సోగ్గాడిగానే తాను ప్రేక్షకులకు గుర్తిండిపోవాలని వయసు మీదపడిన వెంటనే తెరమరుగైపోయాడు. అప్పట్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్లలో రిలీజైతే.. ఆడవాళ్లంతా క్యూ కట్టేవారు. అంతేకాదు ఈయన సినిమాలకు స్పెషల్‌గా ఆడవాళ్లకు ఒక టికెట్ ఇచ్చేవారు.

మగవాళ్లకు రెండు టికెట్స్ ఇచ్చేవారని అప్పట్లో కొన్ని పత్రికలే ఏకంగా రాశాయంటే ఈయన ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. శోభన్‌బాబు ఎంత పెద్ద హీరోనో అంతకంటే పెద్ద రియల్ బిజినెస్ మ్యాన్. అప్పట్లో సౌత్ ఇండియాలో శోభన్‌బాబు కంటే డబ్బున్న హీరో మరొకరు లేరు. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అన్ని వేల కోట్ల ఆస్తులున్న హీరో మరొకరు లేరట. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు.. ఆయన స్నేహితుడు మురళీ మోహన్.

ఇటీవల మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మద్రాసులో ఆయన స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని.. అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని మురళీ మోహన్ చెప్పారు. ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు రూ.80 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. 1976లోనే కొన్ని మేజర్ కంపెనీలలో షేర్స్ కొనుగోలు చేశాడని.. అప్పట్లో షేర్ అనే మాట కూడా ఎవరికీ తెలియదని.. అలాంటి సమయంలోనే శోభన్ బాబు షేర్స్‌పై అవగాహన పెంచుకుని కోట్లు సంపాదించాడని మురళీ మోహన్ చెప్పారు.

షేర్స్, బిజినెస్ అలా ఎన్నో చేసాడని.. ‘మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని.. దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కలేసుకోండి’ అంటూ కొంత మంది సినీ విశ్లేషకులు చెబుతుంటారు. దక్షిణాదిన కాదు.. ఇండియాలోనే శోభన్ బాబు కంటే ఆస్తిపరుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని బల్లగుద్ది మరీ చెప్పగలను’ అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

ఈ రోజుకు కూడా చెన్నైలో.. చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలున్నాయని, ఆయన స్పూర్థితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించానని, ఒకరకంగా వ్యాపారంలో ఆయనే తనకు గురువని మురళీ మోహన్ అన్నారు. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని తన సన్నిహితులకు చెప్పేవాడని.. అలా తనకు కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నారు. శోభన్ బాబు ఆస్తిని ఇప్పటి లెక్కల ప్రకారం లెక్కిస్తే కోట్లకు కోట్లు ఉంటాయని, ఆయన ముందు చూపుతోనే ఇంత స్థాయిలో సంపాదించగలిగాడని చెప్పారు.





పవన్ సినిమాకు బ్రేకులేస్తున్న హీరోయిన్...?

జర్నలిస్టులపై మాటల దాడి చేసిన సీఎం...?

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>