MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bhanu-priya-husband4c4b04b2-b940-4f99-afdd-5201670530a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bhanu-priya-husband4c4b04b2-b940-4f99-afdd-5201670530a4-415x250-IndiaHerald.jpg1967 జనవరి 15వ తేదీన రాజమండ్రిలో జన్మించిన భానుప్రియ అసలు పేరు మంగభాను. చాలా అందంగా కనిపించే భానుప్రియ డాన్స్ లు చేయడంలో దిట్ట. నటనతో పాటు కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం పొందిన భానుప్రియ వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసి వావ్ అనిపించారు. bhanu priya husband;chiranjeevi;abinaya;adarsh;bhanu;sithara;surya sivakumar;vamsi;american samoa;bollywood;cinema;january;tamil;marriage;kannada;car;hindi;husband;wife;hero;kuchipudi;queen;annamayya;chitramభార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?bhanu priya husband;chiranjeevi;abinaya;adarsh;bhanu;sithara;surya sivakumar;vamsi;american samoa;bollywood;cinema;january;tamil;marriage;kannada;car;hindi;husband;wife;hero;kuchipudi;queen;annamayya;chitramSat, 16 Jan 2021 13:00:00 GMTజనవరి 15వ తేదీన రాజమండ్రిలో జన్మించిన భానుప్రియ అసలు పేరు మంగభాను. చాలా అందంగా కనిపించే భానుప్రియ డాన్స్ లు చేయడంలో దిట్ట. నటనతో పాటు కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం పొందిన భానుప్రియ వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసి వావ్ అనిపించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించిన ఈమె మొత్తంగా 111 సినిమాల్లో కనిపించారు. 1983 నుంచి 1996 వరకు భారతీయ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఎనలేని పాపులారిటీని దక్కించుకున్నారు. తన రమణీయమైన కనులతో, ముచ్చటగొలిపే హావభావాలతో, సెగలు పుట్టించే నాట్యంతో లక్షల మంది అభిమానులను సంపాదించారు.

భానుప్రియ ఒక తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమై ఆ తర్వాత సితార సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైయ్యారు. సితార సినిమా హిట్ కావడంతో హీరో వంశీ, భానుప్రియ కాంబినేషన్ కి ప్రజాదరణ బాగా దక్కింది. దీంతో మళ్లీ వారిద్దరి కాంబినేషన్ తోనే పలు సినిమాలను తెరకెక్కించారు. వాటిలో ఆలాపన, అన్వేషణ వంటి హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. గోపమ్మ చేతిలో గోరుముద్ద, ఆకాశంలో హరివిల్లు, జిలిబిలి పలుకుల వంటి ఎన్నో పాటల్లో అత్యద్భుతంగా డాన్స్ చేసి ప్రేక్షకుల మనసులను చూరగొన్న భానుప్రియ.. కే. విశ్వనాధ్ రూపొందించిన స్వర్ణకమలం సినిమాలో చాలా బాగా నటించేసి తన క్రేజ్ ని తారా స్థాయికి తీసుకెళ్లారు.

చిరంజీవి తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె మెగాస్టార్ స్టెప్పులకు దీటుగా డాన్స్ వేసి డ్యాన్సింగ్ క్వీన్ గా పేరొందారు. దోస్తీ దుష్మన్ సినిమాతో ఆమె బాలీవుడ్ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తరువాత ఇన్సాఫ్ కీ పుకార్, ఖుదాగర్జ్, మర్ మితెంగే, తంచా, సూర్య యాన్ అవేకింగ్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో వరుసగా నటించారు కానీ అవేమీ హిట్ కాలేదు. ఏడుకొండలస్వామి, అన్నమయ్య వంటి భక్తి సినిమాల్లో నటించిన భానుప్రియ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. పెదరాయుడు చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. ఆమె ఉత్తమ నటిగా, సపోర్టింగ్ యాక్టర్ గా 3 నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు.

అమెరికా దేశంలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌశల్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ని 1998లో పెళ్లి చేసుకున్న భానుప్రియ ఒక పాప కు జన్మించింది. 2003 లో పుట్టిన ఈ పాపకి అభినయ అని నామకరణం చేశారు. 2005లో భానుప్రియ తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే 2018వ సంవత్సరంలో ఆదర్శ్ గుండెపోటుతో చనిపోయారు. భార్య నుండి విడిపోవడంతో డిప్రెషన్ కి గురయ్యి అయన కన్ను మూయడం పై అనేక వార్తలు వచ్చాయి.


స్టేట్ బ్యాంకు లో అకౌంట్ ఉందా.. ఇది మీకు చేదు వార్తే..?

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

జర్నలిస్టులపై మాటల దాడి చేసిన సీఎం...?

పవన్ సినిమాకు బ్రేకులేస్తున్న హీరోయిన్...?

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>