MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/red5bcc828e-46ec-4f14-b3e7-f280ad00e937-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/red5bcc828e-46ec-4f14-b3e7-f280ad00e937-415x250-IndiaHerald.jpgభారీ అంచనాల నడుమ విడుదలైన 'రెడ్' మూవీ తొలిషో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) వైజాగ్‌లో RED సక్సెస్ మీట్ నిర్వహించారు. శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ వేడుకలో హీరో రామ్ తన హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. తన స్పీచ్ వింటూ ఈలలు వేస్తూ గోల చేశారు ఆడియన్స్.red;review;meera;kranthi;kranti;prema;ram pothineni;tiru;makar sakranti;visakhapatnam;sreemukhi;tollywood;cinema;telugu;sankranthi;vishakapatnam;tirupati;love;pistachio;audience;director;hero;success;devadas;v;amrita dhanoa;crush;kishore tirumala;red;chitram'రెడ్' సినిమా సక్సెస్ మీట్ లో హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్న హీరో రామ్...'రెడ్' సినిమా సక్సెస్ మీట్ లో హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్న హీరో రామ్...red;review;meera;kranthi;kranti;prema;ram pothineni;tiru;makar sakranti;visakhapatnam;sreemukhi;tollywood;cinema;telugu;sankranthi;vishakapatnam;tirupati;love;pistachio;audience;director;hero;success;devadas;v;amrita dhanoa;crush;kishore tirumala;red;chitramSat, 16 Jan 2021 23:45:00 GMTగత సంవత్సరం 2020లో విడుదల కావాల్సిన చిత్రం... ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ RED. కానీ కరోనా కారణంగా విధించిన వరుస లాక్ డౌన్ల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా విడుదల అయింది. అయితే ఇక ఈ చిత్రంలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించగా.. ఆయన సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ తొలిషో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) వైజాగ్‌లో RED సక్సెస్ మీట్ నిర్వహించారు. శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ వేడుకలో హీరో రామ్ తన హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. తన స్పీచ్ వింటూ ఈలలు వేస్తూ గోల చేశారు ఆడియన్స్.



ఇక హీరో రామ్ మాట్లాడుతూ... చూస్తున్నా, చూస్తున్నా ఏదీ ఉంచుకోను. అన్నీ తిరిగిచ్చేస్తా అంటూ అభిమానులను హూషారెత్తించారు. ''సినిమాలో ట్విస్టులకన్నా సినిమా రిలీజ్ తర్వాతే పెద్ద ట్విస్ట్ జరిగింది. అదేంటంటే.. సినిమా రిలీజ్ సమయంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాం. మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. సరేలే అనుకున్నాం. ఇంతలో నెమ్మది నెమ్మదిగా సాయంత్రం కల్లా టాక్ మారిపోయి ఓ ట్విస్ట్ వచ్చింది. హిట్ సినిమా అనేశారు. ఇక ఆ తర్వాత బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. కలెక్షన్స్ చూస్తుంటే రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సస్పెన్స్ థ్రిలర్ విత్ ది ట్విస్ట్ అంటే ఇదే. ఈ సినిమాకు మేమంతా చాలా కష్టపడ్డాం. చాలా ఇష్టపడి చేసాం. మూవీ ఇంత బాగా రావడానికి కారణం కెప్టెన్ అఫ్ ది టీమ్ కిషోర్ గారు. మాళవికను చూసి టాలీవుడ్ న్యూ క్రష్ అంటున్నారు. శ్రీముఖి.. నువ్వు సూపర్. ఎందుకంటే వీళ్లందరినీ కంట్రోల్ చేస్తున్నావ్ కదా అని చమత్కరించారు.




ఇక సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే సంక్రాంతి సమయానికి 'దేవదాస్' సినిమాతో వచ్చా. నేనెప్పుడూ కాంపిటేషన్ గురించి ఆలోచించేవాడిని కాదు. కానీ 15 ఏళ్ల తర్వాత నాకు కాంపిటేషన్ ఎవరనేది అర్థమైంది.. అది మీరే. ఇక నుంచి మీరా.. నేనా? అనేది చూపిస్తా. మీరు చూపించే ప్రేమ ఎక్కువా లేక నేను స్క్రీన్ మీద నేను చూపించే ప్రేమ ఎక్కువా? అనేది ఇక తేల్చుకుంటా. మర్చిపోను.. కాంపిటేషన్ చాలా సీరియస్‌గా తీసుకుంటా'' అని రామ్ అన్నారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ''మా సినిమాను సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. వైజాగ్‌కి, నాకు మంచి అనుబంధం ఉంది. షూటింగ్ మాత్రమే కాదు స్క్రిప్ట్ కోసం కూడా నేను వైజాగ్ వస్తుంటా. సినిమా సక్సెస్‌లో భాగమైన మంచి మంచి మాటలన్నీ ఈ సముద్రం ముందు కూర్చొని రాసినవే. RED సక్సెస్‌లో మెయిన్ పాత్ర హీరో రామ్‌దే. థాంక్యూ సో మచ్'' అన్నారు.




అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>