MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonusoodf92fbf19-5195-4a78-ad6e-2c0a67e781df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonusoodf92fbf19-5195-4a78-ad6e-2c0a67e781df-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా క్రాక్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక క్రాక్ సినిమాతో పాటు ఈ సంక్రాంతికి ఇళయ దళపతి విజయ్ నటించిన మాస్టర్, చాక్లెట్ బాయ్ రామ్ నటించిన రెడ్ చిత్రాలు విడుదలయ్యాయి.sonusood;ravi;gopichand malineni;kranthi;kranti;ram pothineni;ravi teja;santoshi;vijay;makar sakranti;bollywood;cinema;telugu;sankranthi;huzur nagar;media;producer;remake;producer1;hero;chocolate;joseph vijay;tagore madhu;dalapathi;mass;master;krack;red;chitramతెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రం రీమేక్.. హీరోగా సోనూసూద్?తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రం రీమేక్.. హీరోగా సోనూసూద్?sonusood;ravi;gopichand malineni;kranthi;kranti;ram pothineni;ravi teja;santoshi;vijay;makar sakranti;bollywood;cinema;telugu;sankranthi;huzur nagar;media;producer;remake;producer1;hero;chocolate;joseph vijay;tagore madhu;dalapathi;mass;master;krack;red;chitramSat, 16 Jan 2021 12:25:48 GMTమాస్ మహరాజ్ రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా క్రాక్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక క్రాక్ సినిమాతో పాటు ఈ సంక్రాంతికి ఇళయ దళపతి విజయ్ నటించిన మాస్టర్, చాక్లెట్ బాయ్ రామ్ నటించిన రెడ్ చిత్రాలు విడుదలయ్యాయి. మాస్టర్, రెడ్ చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో సంక్రాంతి విన్నర్‌గా మాస్ మహరాజ్ నిలిచాడు. విడుదలైన ఐదు రోజుల్లోనే బయ్యర్లు ప్రాఫిట్‌లోకి వచ్చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇంతలా విజయమైన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లోకి రీమేక్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలను బాలీవుడ్ నటులు రీమేక్ చేస్తుండటం సాధారణంగా జరుగుతూనే వస్తోంది.

అయితే ఈ సారి బాలీవుడ్ హీరోలు కాకుండా ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్స్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రీమేక్ హక్కుల కోసం సోనూ సూద్ ఇప్పటికే క్రాక్ చిత్ర నిర్మాత ఠాగూర్ మధుతో సంప్రదింపులు కూడా జరిపారట. అంతేకాకుండా సోనూ సూద్ తన సొంత ప్రొడక్షన్‌లో ఈ క్రాక్ రీమేక్ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మిస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ఆపదలో ఉన్న వారిని ఏ విధంగా ఆదుకున్నారో చూశాం.

ఇప్పటికి సోషల్ మీడియా ఖాతాల ద్వారా అన్నా ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని అడిగిన వారికి లేదు అని అనకుండా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా మారబోతున్నారన్న వార్త విని సోనూ సూద్ అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. సోనూ సూద్ రియల్ హీరో అని.. ఇప్పుడు ఆయన రీల్ లైఫ్‌లోనూ హీరో అవతారం ఎత్తడం సంతోషించదగ్గ విషయమని అంటున్నారు. 


పవన్ సినిమాకు బ్రేకులేస్తున్న హీరోయిన్...?

జర్నలిస్టులపై మాటల దాడి చేసిన సీఎం...?

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>