PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-china406ae2ea-a0b2-4ad2-855f-10ff206db974-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-china406ae2ea-a0b2-4ad2-855f-10ff206db974-415x250-IndiaHerald.jpgయుద్ద తంత్రాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఇప్పుడు ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా సైన్యాలు ముఖాముఖి తలపడే రోజులు పోయాయి. ఇక ఇప్పుడు యుద్ధాలన్నీ టెక్నాలజీ ఆధారంగానే జరిగే రోజులు వచ్చాయి. శత్రువు ఎక్కడో ఉంటాడు.. మనపై మారణాయుధాలు ప్రయోగిస్తాడు.. అందుకే ఇప్పుడు ఏ దేశానికి ఎక్కువ టెక్నాలజీ ఉండే.. ఆ దేశానిదే పైచేయి అవుతుంది. అందుకే ఇండియా ఇప్పుడు తన టెక్నాలజీని మరింతగా పెంచుకుంటోంది. అందులో భాగంగా తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీయే స్వార్మ్‌ టెక్నాలజీ. అదే ఇంకో మాటలో చెప్పాలంటే డ్రోన్ టెక్నాలజీ.. దీని india-china;technology;tejas;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;mandula;army;indian;v;shatru1ఈ ఇండియన్ ఆర్మీ యుద్ధ తంత్రం.. చూస్తే పొరుగు దేశాలకు ముచ్చెమటలే..!ఈ ఇండియన్ ఆర్మీ యుద్ధ తంత్రం.. చూస్తే పొరుగు దేశాలకు ముచ్చెమటలే..!india-china;technology;tejas;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;mandula;army;indian;v;shatru1Sat, 16 Jan 2021 10:00:00 GMT టెక్నాలజీ ఆధారంగానే జరిగే రోజులు వచ్చాయి. శత్రువు ఎక్కడో ఉంటాడు.. మనపై మారణాయుధాలు ప్రయోగిస్తాడు.. అందుకే ఇప్పుడు ఏ దేశానికి ఎక్కువ టెక్నాలజీ ఉండే.. ఆ దేశానిదే పైచేయి అవుతుంది. అందుకే ఇండియా ఇప్పుడు తన టెక్నాలజీని మరింతగా పెంచుకుంటోంది.

అందులో భాగంగా తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీయే స్వార్మ్‌ టెక్నాలజీ. అదే ఇంకో మాటలో చెప్పాలంటే డ్రోన్ టెక్నాలజీ.. దీని ద్వారా భారత్ తన శత్రువులపై మన భూభాగం నుంచే విరుచుకుపడొచ్చు. డ్రోన్ల గుంపు ద్వారా శత్రువులపై దాడి చేయొచ్చు. మన భూబాగంలో ఉండే శత్రువుల  ట్యాంకులు, శత్రు స్థావరాలు ధ్వంసం చేయొచ్చు. ఈ టెక్నాలజీ పూర్తిగా భారత్‌ యుద్ధ తంత్రాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


ఈ స్వార్మ్ ‌టెక్నాలజీపై భారత్ చాలా స్పీడ్‌గా పట్టు సాధించింది. గతేడాది ఆగస్టులో స్వార్మ్‌ టెక్నాలజీపై ఇండియా దృష్టి పెట్టింది. ప్రైవేటు సంస్థ న్యూస్పేస్‌ రీసెర్చి అండ్‌ టెక్నాలజీస్‌తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. మొదట్లో ఐదు డ్రోన్లతో ప్రయోగాలు ప్రారంభించి.. ప్రస్తుతం  75డ్రోన్లను ప్రయోగించే రేంజ్‌కు వచ్చింది. ఈ టార్గెట్‌ను  1,000 రోటరీ వింగ్‌ డ్రోన్లకు పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ స్వార్మ్‌ టెక్నాలజీని నాశనానికే కాదు ప్రయోజనానికీ వాడొచ్చు. దాడులకే కాదు.. సాయానికి కూడా వాడవచ్చు. ఈ డ్రోన్ల ద్వారా క్లిష్టమైన సమయాల్లో సైన్యానికి సాయం చేయొచ్చు. కఠినమైన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలకు సరుకులు, మందులు అందించేందుకు వాడొచ్చు.  75 డ్రోన్లు ఉండే ఓ గుంపు.. దాదాపు 600 కిలోల సరుకులను మోసుకెళ్లగలుగుతుంది. మొన్న తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం, నేడు స్వార్మ్‌ టెక్నాలజీ.. మొత్తానికి ఇండియన్ ఆర్మీ కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పొచ్చు. 


ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...

ఏపీ డీజీపీ సవాంగ్ పై ముప్పేట దాడి..

కాళేశ్వరం వెళ్తున్న బండి సంజయ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>