PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు విషయం అనేది ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడటానికి గానూ... ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి దేవాలయాలపై దాడులు చేస్తున్నారని పోలీసులు కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.. డీజీపీ గౌతమ్ సవాంగ్ దీనిపై చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారింది. ముందు దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని చెప్పిన ఆంధ్రప్రదేశ్ డిజిపి అనూహ్యంగా రెండు రోజుల్లోనే మాటమార్చి దీని వెనుక రాజకీయ కోణం ఉంది అనే వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు తెలుగుదేశంdgp;gautham new;gautham;bharatiya janata party;telugu desam party;andhra pradesh;hosta;telugu;police;ycp;partyఈ విషయంలో డీజీపీ తప్పు చేసారా...?ఈ విషయంలో డీజీపీ తప్పు చేసారా...?dgp;gautham new;gautham;bharatiya janata party;telugu desam party;andhra pradesh;hosta;telugu;police;ycp;partySat, 16 Jan 2021 10:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు విషయం అనేది ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడటానికి గానూ... ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి దేవాలయాలపై దాడులు చేస్తున్నారని పోలీసులు కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.. డీజీపీ గౌతమ్ సవాంగ్ దీనిపై చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారింది. ముందు దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని  చెప్పిన ఆంధ్రప్రదేశ్ డిజిపి అనూహ్యంగా రెండు రోజుల్లోనే మాటమార్చి దీని వెనుక రాజకీయ కోణం ఉంది అనే వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సరైన ఆధారాలు లేకుండా డిజిపి ప్రకటనలు చేస్తున్నారని ఇదే వైఖరి భవిష్యత్తులో కూడా కొనసాగితే ఆయన డీజీపీగా కొనసాగడానికి ఏమాత్రం అర్హుడు కాదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ నేతలను కూడా కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని మొత్తం 17 మంది తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఉంటే మంచిది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డీజీపీ స్థాయి లో ఉన్న వ్యక్తి ఇలా ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు భావ్యం కాదు అని అంటున్నారు. అయితే అధికార వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తప్పు చేసి ఉంటే ఇప్పటి వరకు అరెస్టు చేసిన నేతల పేర్లను కూడా బయపెట్టకపోవడం గమనార్హం.


తెలంగాణ సీఎంగా కేటీఆర్‌... ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు...!

వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..!?

బీజేపీతో పొత్తు.. 21న తేలిపోతుందా ? జ‌న‌సేన‌లో హాట్ టాపిక్‌..!

ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>