HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/health/movies_news/ice-cream132f8cc4-934c-41e4-8f0f-854c1c80ee02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/health/movies_news/ice-cream132f8cc4-934c-41e4-8f0f-854c1c80ee02-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ మహమ్మారి ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే విషయం తాజాగా రుజువయ్యింది. ఐస్‌క్రీమ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఘటన చైనాలో వెలుగు చూసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక దుకాణాల్లో తయారైన మూడు ఐస్‌క్రీమ్ బాక్సుల శాంపిళ్లలో కరోనా వైరస్‌ను గుర్తించారు.చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. టియాంజిన్ మునిసిపాలిటీలో డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను గుర్తించారుice cream;manu;ukraine;new zealand;telugu;media;doctor;local language;protein;coronavirusఐస్ క్రీం డబ్బాలలో కరోనా వైరస్ ను గుర్తించిన చైనా....ఐస్ క్రీం డబ్బాలలో కరోనా వైరస్ ను గుర్తించిన చైనా....ice cream;manu;ukraine;new zealand;telugu;media;doctor;local language;protein;coronavirusSat, 16 Jan 2021 15:30:00 GMTఏదైనా ఒక వైరస్ చల్లని ప్రదేశాల్లో పలు రకాలుగా మరింతగా వ్యాప్తి చెందుతుంది అని అనేకమంది దానికి గల కారణాలు వివరిస్తుంటారు. అయితే ఐస్‌క్రీమ్‌, కూల్ డ్రింక్స్ లాంటి ఇతర చల్లని పదార్థాలు తినడం వల్ల కరోనా వైరస్‌ సోకుతుందనేందుకు ఏ శాస్త్రీయ ఆధారం లేదని భారత ప్రభుత్వ సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ మాయదారి కరోనా వైరస్ మహమ్మారి ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే విషయం తాజాగా రుజువయ్యింది. ఐస్‌క్రీమ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఘటన చైనాలో వెలుగు చూసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక దుకాణాల్లో తయారైన మూడు ఐస్‌క్రీమ్ బాక్సుల శాంపిళ్లలో కరోనా వైరస్‌ను గుర్తించారు.




చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. టియాంజిన్ మునిసిపాలిటీలో డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను గుర్తించారు. వాటిలోని 2,089 బాక్సులను స్టోరేజ్‌లో ఉంచి సీల్ చేశారు. మరో 1,812 బాక్సులను ఇతర ప్రాంతానికి తరలించగా.. మిగతా 935 డబ్బాలు స్థానిక మార్కెట్‌కు తరలించారు. వీటిలో 65 బాక్సులు ఇప్పటికే అమ్ముడయినట్టు పేర్కొంది. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫన్ గ్రాఫిన్ మాట్లాడుతూ.. ఐస్‌క్రీమ్ బాక్సుల్లోకి కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించిందన్నారు. దీంతో ఐస్‌క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ అంతా వైరస్ వ్యాప్తిచెందే అవకాశముందని పేర్కొన్నారు. ఐస్‌క్రీమ్ అనేది ఫ్యాట్‌తో తయారవుతుందని, దానిని కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచడం వల్ల అక్కడ వైరస్ వేగంగా వృద్ధి చెందుతుందని తెలిపారు.



ప్రతి ఐస్‌క్రీం అకస్మాత్తుగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందనే ఆందోళన అవసరం లేదు’ అని అన్నారు. ‘ఉత్పాదక ప్లాంట్‌లో సమస్య, కర్మాగారంలో పరిశుభ్రతకు దారితీసే అవకాశం ఉంది’అని వివరించారు. ఈ ఐస్‌క్రీమ్‌ల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలైన పాల పొడి వంటివి న్యూజిలాండ్ నుంచి, ప్రొటీన్ పౌడర్ ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తాము ఉత్పత్తిచేసిన ఐస్‌క్రీమ్‌ల్లో కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు డాకియాడో ధ్రువీకరించింది. ప్లాంట్‌లో పనిచేసే మొత్తం 1,662 ఉద్యోగులను క్యారంటైన్‌లో ఉంచి న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వీరిలో 700 మందికి నెగెటివ్ వచ్చిందని, మిగతా 962 మంది ఫలితాల నివేదిక రావాల్సి ఉందని పేర్కొంది. ఈ పరీక్షల ద్వారా మరోసారి చల్లని ఆహార పదార్థాలపై వైరస్ ఎక్కువగా ప్రభావితం చూపుతుంది అని తెలుస్తోంది. 




నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>