PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona3fc14996-659a-4dd8-9c91-e9315cd34804-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona3fc14996-659a-4dd8-9c91-e9315cd34804-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి. దానితో పాటు కరోనా వైరస్ కేసులు కూడా అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. . ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక బులిటెన్‌ విడుదల చేసింది.carona;koti;andhra pradesh;bari;zero;coronavirusఏపీ ప్రజలకు శుభవార్త : జీరో కి పడిపోయిన కరోనా మరణాల సంఖ్యఏపీ ప్రజలకు శుభవార్త : జీరో కి పడిపోయిన కరోనా మరణాల సంఖ్యcarona;koti;andhra pradesh;bari;zero;coronavirusSat, 16 Jan 2021 22:20:00 GMTకరోనా వైరస్ కేసులు కూడా అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. . ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక   బులిటెన్‌ విడుదల చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా  గడిచిన 24 గంటల్లో 25 వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 114 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8 లక్షల 85 వేలకి చేరింది....

ఇక, చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య ఏడు వేలకు చేరింది.

అలాగే రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. కరోనా బారి నుంచి శనివారం మొత్తం 326 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల 76 వేల మంది  పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,987 కు చేరాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 25 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, జిల్లాల వారీగా కేసులు చూస్తే శనివారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 24 కరోనా కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు అత్యల్పంగా ఉండడం విశేషం. అయితే దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగింది.. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసి  వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది  . ఇందులో భాగంగా మొదటి దశలో వైద్య మరియు పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలను వేసింది.





అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>