MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-into-reqlity-shows7ee27547-08af-4333-953e-93fcf76a6109-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-into-reqlity-shows7ee27547-08af-4333-953e-93fcf76a6109-415x250-IndiaHerald.jpgతెలుగు సినీపరిశ్రమలో నేరుగా నటించక పోయినప్పటికీ... డబ్బింగ్ సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక. ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషల్లో డబ్ చేశారు.rashmika into reqlity shows;beauty;govinda;allu arjun;bhama;geetha;govi;rashmika mandanna;india;bollywood;cinema;telugu;google;tamil;2020;twitter;kannada;hindi;heroine;dear comrade;arjun 1;punjabi;nijam;crush;sandal wood;chitramరియాలిటీ షోలో రష్మిక మందన్న...!రియాలిటీ షోలో రష్మిక మందన్న...!rashmika into reqlity shows;beauty;govinda;allu arjun;bhama;geetha;govi;rashmika mandanna;india;bollywood;cinema;telugu;google;tamil;2020;twitter;kannada;hindi;heroine;dear comrade;arjun 1;punjabi;nijam;crush;sandal wood;chitramSat, 16 Jan 2021 14:00:00 GMT" style="height: 694px;">
చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక మందన్న... తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటోంది. గీత గోవిందం సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసింది లేదు. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి అగ్ర హీరోయిన్ లకు పోటీగా మారింది. యంగ్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది ఈ శాండిల్ వుడ్ బ్యూటీ. ఇటు తెలుగులో అటు కన్నడలో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ గీత గోవిందం హీరోయిన్. ప్రస్తుతం ఈమె చేతిలో అల్లు అర్జున్,.. ‘పుష్ప’ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఈమె తెలుగుతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో, ఆచార్య సినిమాలో చెర్రీ సరసన బిజీగా ఉంది. తాజాగా ఈ భామ.. బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయకిగా చేస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఆశ పడుతోంది ఈ అందాల బొమ్మ. ఈ చిత్రంతో బీ టౌన్‌లో కూడా తన సత్తా చూపెట్టాలని చూస్తోంది. ఇదిలా ఉండగా..గూగుల్ 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక మందన్న ఎంపికయ్యారు. ఇంత అరుదైన పురస్కారం పొందడం నిజంగా గర్వించదగ్గ విషయం. ప్రస్తుతానికి తెలుగు, కన్నడ భాష లకే పరిమితమైన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటనుంది.

తెలుగు సినీపరిశ్రమలో నేరుగా నటించక పోయినప్పటికీ... డబ్బింగ్ సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక. ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషల్లో డబ్ చేశారు. ఇక మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే..? రష్మిక  మరింత పాపులారిటీని పెంచుకునేందుకు  అక్కడ ప్రసారమయ్యే ఒక రియాలిటీషోలో పార్టిసిపేట్ చేస్తోంది. తాజాగా ఈమె పంజాబీ రాప్ సాంగ్ ‘టక్కర్’లో నటించింది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక మందన్న తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తు తమ అభిమాన తారకు గుడ్ లక్ చెబుతున్నారు.


అధిక బరువును జయించిన సెలబ్రిటీలు!

నమ్రతను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అని మహేష్ బాబు ని బెదిరించింది ఎవరు...?

ఏపీ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి

ట్రంప్ మరో అపఖ్యాతి !

భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?

నమ్రత పెట్టిన పోస్టు చూసి హర్ట్ అయిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>