PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu471ae590-5c32-4481-ab5f-171ef1fb0dd6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu471ae590-5c32-4481-ab5f-171ef1fb0dd6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కొంచెం ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా అనే దానిపై ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుందా... లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలవరానికి కేంద్ర నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పchandrababu, tdp;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;central government;dookudu;partyపోలవరం వద్ద చంద్రబాబు భారీ సభ...?పోలవరం వద్ద చంద్రబాబు భారీ సభ...?chandrababu, tdp;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;central government;dookudu;partySat, 16 Jan 2021 12:58:18 GMTఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కొంచెం ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా అనే దానిపై ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుందా... లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలవరానికి కేంద్ర నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.

అయితే ఇప్పుడు పోలవరం విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు నాయుడు త్వరలో వెళ్లే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అలాగే ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు సభను నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఉంది.

పోలవరం తన హయాంలో ఎంత పూర్తయింది ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత పూర్తి చేశారు అనే అంశాలను చంద్రబాబు నాయుడు ప్రధాన ఎజెండాగా చేసుకుని ప్రజల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పోలవరం పునరావాస విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానికులకు అన్యాయం జరుగుతుంది అనే అంశాన్ని కొన్ని పార్టీలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి అక్కడి ప్రజలతో కూడా చంద్రబాబు నేరుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి కచ్చితంగా నీళ్లు ఇస్తామని జగన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.


గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

జర్నలిస్టులపై మాటల దాడి చేసిన సీఎం...?

పవన్ సినిమాకు బ్రేకులేస్తున్న హీరోయిన్...?

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!

పాపం బాబు... మాటకు విలువ లేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>