PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgశనివారం విజయవాడలో కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ మొదటి విడత కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు మొదటి విడతలో వ్యాక్సినేషన్ మొదలు అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సిన్‌ సెషన్స్‌ సైట్లలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ చేరుకోగా... వ్యాక్సిన్ ను కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు అనుసరించి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రోటోకాల్‌ అనుగుణంగా పకడ్బందీ ఏర్పys jagan;mekathoti sucharitha;jagan;vijayawada;andhra pradesh;district;minister;good news;central government;tadepalli;good newwzఏపీ ప్రజలకు జగన్ గుడ్ న్యూస్...!ఏపీ ప్రజలకు జగన్ గుడ్ న్యూస్...!ys jagan;mekathoti sucharitha;jagan;vijayawada;andhra pradesh;district;minister;good news;central government;tadepalli;good newwzSat, 16 Jan 2021 09:15:00 GMTకేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు అనుసరించి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రోటోకాల్‌ అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసారు.

ఉదయం 11.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి వైఎస్‌ జగన్‌ బయల్దేరి వెళ్తారు. 11.25 గంటలకు విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జిజిహెచ్‌)కి సీఎం చేరుకుంటారు. అనంతరం మొదటివిడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు జగన్. ఇక ఇదిలా ఉంటే... గుంటూరు జిల్లాలో కరోనా టీకా పంపిణీకి  31 కేంద్రాలు ఏర్పాటు చేసారు. టీకా కేంద్రాలకు  వ్యాక్సిన్ ని అధికారులు తరలించారు.  తొలిరోజున జిల్లావ్యాప్తంగా 2వేల 466 మందికి టీకా అందిస్తారు అధికారులు.

వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు రెండు కమిటీలు ఏర్పాటు చేసారు. కో విన్ యాప్ లో సమాచారం అప్ లోడ్ పర్యవేక్షణకు  జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. జీజీహెచ్ లో టీకా కార్యక్రమం ప్రారంభంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కూడా పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా టీకా కార్యక్రమం ప్రారంభం ఉంటుంది. ఇక అనంతపురం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసారు. జిల్లాకు 35500 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. మొదటి విడతలో 30, 747 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్  అందిస్తారు. వ్యాక్సిన్ కు దూరంగా గర్భిణి స్త్రీలు, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఉన్నారు.


ఏపీ డీజీపీ సవాంగ్ పై ముప్పేట దాడి..

కాళేశ్వరం వెళ్తున్న బండి సంజయ్...?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>