MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi86b9983c-6a5d-4d2b-9bd6-8010ec4ef188-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi86b9983c-6a5d-4d2b-9bd6-8010ec4ef188-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సాయి కుమార్ కొడుకు కూడా ఆది కూడా హీరోగా మెప్పిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆది చేసిన సినిమాలు వరుస ఫ్లప్ లు కావడంతో చిత్ర పరిశ్రమకు కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు. aadi;chiranjeevi;kumaar;geetha;kranthi;kranti;makar sakranti;adinarayanareddy;cinema;sangeetha;sankranthi;hero;heroine;success;sai kumar;anandamత్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న శశి..!?త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న శశి..!?aadi;chiranjeevi;kumaar;geetha;kranthi;kranti;makar sakranti;adinarayanareddy;cinema;sangeetha;sankranthi;hero;heroine;success;sai kumar;anandamSat, 16 Jan 2021 09:00:00 GMTసాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సాయి కుమార్ కొడుకు కూడా ఆది కూడా హీరోగా మెప్పిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆది చేసిన సినిమాలు వరుస ఫ్లప్ లు కావడంతో చిత్ర పరిశ్రమకు కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు.

తాజాగా ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఇక ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ గురువారం ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో హీరో హీరోయిన్లు ఆది, సుర‌భి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్నారు. ఆదిని ప్రేమ‌గా కౌగ‌లించుకొని సుర‌భి క‌ళ్లు మూసుకొని ఉంటే, ఆది ఆనందంగా న‌వ్వుతున్నాడు. ఇటీవ‌ల ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే టీజ‌ర్‌లో ఆది స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడ‌నీ, అత‌నికి ఈ సినిమా బ్రేక్ నిస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంద‌నీ చెప్ప‌డంతో పాటు, ఒక ఫ్రెష్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా తీసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌నీ చిరంజీవి ప్ర‌శంసించారు.అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి అమ‌రనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆది. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మరి ఆది ఈ సినిమాతో సక్సెస్ సాదిస్తాడేమో చూడాలి మరి.


బాలుడిపై అత్యాచారం.. ఆపరేషన్ చేయించి మరి.. ఛీ.. ఛీ..?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>