PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukka-plan-on-by-election-nagarjuna-sagar4db48acb-aa73-43aa-8c49-fd0b4e53c5f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukka-plan-on-by-election-nagarjuna-sagar4db48acb-aa73-43aa-8c49-fd0b4e53c5f9-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికను పార్టీతో పాటు కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి చూసిన అధికారపార్టీ ఈ బై ఎలక్షన్ లో మాత్రం గెలిచి తీరాలని భావిస్తోంది. కానీ అభ్యర్థి ప్రకటనను మాత్రం ఇంత వరకు చేయలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో టిఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోందా? ఎన్నికల షెడpukka plan on by election nagarjuna sagar;ktr;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mla;janareddy;partyఉపఎన్నికపై పక్కా ప్లాన్..!ఉపఎన్నికపై పక్కా ప్లాన్..!pukka plan on by election nagarjuna sagar;ktr;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mla;janareddy;partySat, 16 Jan 2021 20:00:00 GMTనాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికను పార్టీతో పాటు కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి చూసిన అధికారపార్టీ ఈ బై ఎలక్షన్ లో మాత్రం గెలిచి తీరాలని భావిస్తోంది. కానీ అభ్యర్థి ప్రకటనను మాత్రం ఇంత వరకు చేయలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో టిఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోందా? ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే... బై ఎలక్షన్ అభ్యర్థిని ప్రకటిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నియోజక వర్గంపై సమీక్ష చేయనుండటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో రాజకీయాల్లో ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించే టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. అధికార పార్టీ ఈ ఎలక్షన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు  నివేదికలను తెప్పించుకుంటోంది. నాగార్జున సాగర్ లో పార్టీ పరిస్థితులపై సర్వేలు చేయిస్తోంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున జానారెడ్డి బరిలో దిగనున్నారు. బీజేపీ కూడా ఈ.. బై ఎలక్షన్ పై దృష్టి పెట్టింది. ఇలాంటి పరిస్థితిలో టీఆర్ఎస్... అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుందా అనే చర్చ మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత... టిఆర్ఎస్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థి  విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం పలువురు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అభ్యర్థిగా ఎవరికి అవకాశం వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల రిజల్ట్ మళ్లీ ఇక్కడ రిపీట్ కాకూడదని అనుకుంటున్న అధికార పార్టీ.. ఈసారి బరిలో బలమైన అభ్యర్థినే నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.







ఆ ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మ పడాల్సిందేనా?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>