Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/prabhasbf0b1532-1226-45cc-a0c2-c107a6a7180b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/prabhasbf0b1532-1226-45cc-a0c2-c107a6a7180b-415x250-IndiaHerald.jpgవెండి తెరపై మెరవాలని, స్టార్లుగా ఎదగాలని ఎంతో మంది అనుకుంటుంటారు. అయితే ఆ అదృష్టం ఎవరో కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అలా దక్కించుకున్నవారు కూడా ఎంతో పట్టుదలతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే అలా అవకాశాలు దక్కినా..prabhas;mahesh;prabhas;mahesh bhatt;suresh;geetha;krishna;krishnam raju;mani sharma;swetha;india;tollywood;cinema;sangeetha;telugu;love;silver;heroine;raghavendra;chitramఈ ప్రభాస్ హీరోయిన్ గుర్తుందా.. ఒక్క సినిమాతోనే..ఈ ప్రభాస్ హీరోయిన్ గుర్తుందా.. ఒక్క సినిమాతోనే..prabhas;mahesh;prabhas;mahesh bhatt;suresh;geetha;krishna;krishnam raju;mani sharma;swetha;india;tollywood;cinema;sangeetha;telugu;love;silver;heroine;raghavendra;chitramSat, 16 Jan 2021 10:54:46 GMTఇంటర్నెట్ డెస్క్: వెండి తెరపై మెరవాలని, స్టార్లుగా ఎదగాలని ఎంతో మంది అనుకుంటుంటారు. అయితే ఆ అదృష్టం ఎవరో కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అలా దక్కించుకున్నవారు కూడా ఎంతో పట్టుదలతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే అలా అవకాశాలు దక్కినా, కొంత అదృష్టం కూడా వారికి కలిసిరావాలి. అలా కాకుంటే ఎంత ప్రతిభ ఉన్నా ఒకటి, రెండు సినిమాలతోనే కనుమరుగైపోతారు. అలాంటి ఓ కథానాయికే శ్వేత అగర్వాల్.

ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో “రాఘవేంద్ర” అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రభాస్‌కు రెండో సినిమా. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా శ్వేత అగర్వాల్ నటించారు. ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్‌లోనే టాప్ హీరోగా.. పాన్ ఇండియా ఇమేజ్‌తో వెలిగిపోతున్నారు. కానీ శ్వేత మాత్రం ఆ సినిమా తరువాత మళ్లీ టాలీవుడ్ తెరపై కనిపించలేదు. రాఘవేంద్ర అంతగా ఆడకపోవడంతో శ్వేత పెర్ఫార్మెన్స్ మొత్తం కనిపించకుండా పోయింది.

శ్వేత అగర్వాల్ రాఘవేంద్ర చిత్రంలో నటించిన 5 సంవత్సరాల గ్యాప్ అనంతరం ఆంగ్లంలో “తందూరి లవ్” అనే సినిమా హీరోయిన్‌గా నటించారు. కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చివరగా బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన “షాపిత్” అనే హార్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 ఈ సినిమా తరువాత మళ్లీ సినిమాల్లో శ్వేత బిజీ అవుతారని అనుకున్నారు. కానీ ఆ సమయంలోనే వ్యక్తిగత కారణాలు ఆమెను దెబ్బ తీశాయి. దీంతో ఆమె పూర్తిగా వెండితెరకు దూరమైపోయారు. అయితే ప్రస్తుతం శ్వేతా అగర్వాల్ ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? అనేక ఏం చేస్తుంది.? అనే విషయాల మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు.

ఇదిలా ఉంటే రాఘవేంద్ర చిత్రంలో ప్రభాస్ సరసన అన్షు నటించింది. ఈ చిత్రం తరువాత అన్షు కూడా తెలుగులో అంతంత మాత్రంగానే కనిపించింది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.





భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!

కంగారు పడకండి.. వ్యాక్సిన్ వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..?

అర్జంటుగా తిరుపతికి పవన్... కూటమిలో ఏం జరుగుతోంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>