PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ashokea3ed863-9af7-4c0b-9810-1a80e51eab21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ashokea3ed863-9af7-4c0b-9810-1a80e51eab21-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. టీడీపీలో కీలక నేతలుగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు ఈ దాడుల అంశాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక మూడు రోజుల క్రితం డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. రెండు రోజుల్లో రెండు మాటలు మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ నేతలు డీజీపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఘటన విషయంలో ashok gajipatiraju;ashok;raaga;telugu desam party;andhra pradesh;telugu;cbi;temple;minister;tdp;central government;partyనేను డబ్బులు ఇస్తే వెనక్కు ఇచ్చేస్తారా...?: అశోక గజపతి ఆవేదననేను డబ్బులు ఇస్తే వెనక్కు ఇచ్చేస్తారా...?: అశోక గజపతి ఆవేదనashok gajipatiraju;ashok;raaga;telugu desam party;andhra pradesh;telugu;cbi;temple;minister;tdp;central government;partySat, 16 Jan 2021 18:06:46 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. టీడీపీలో కీలక నేతలుగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు ఈ దాడుల అంశాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక మూడు రోజుల క్రితం డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. రెండు రోజుల్లో రెండు మాటలు మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ నేతలు డీజీపీని టార్గెట్ చేస్తున్నారు.

ఈ ఘటన విషయంలో సిబిఐ దర్యాప్తు కూడా డిమాండ్ చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేసారు. విజయనగరం జిల్లాలో మాజీ  కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. దురదృష్ట కర ఘటన రామతీర్దంలో జరిగింది అని ఆయన అన్నారు. చట్టం అందరికి ఓకేలా ఉండాలి అని వ్యాఖ్యానించారు. దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయం సరికాదు అని ఆయన ఆరోపించారు. ఎటువంటి నోటీసులు లేకుండా అనువంశిక  చైర్మన్ పదవి నుండి తొలగించారు  అని మండిపడ్డారు.

చట్టం ప్రకారం  తీసుకోవాల్సిన చర్యలు లేవు అని ఆయన విమర్శించారు. అంతర్వేది, దుర్గ గుడి  ఘటనలో చైర్మన్, ఈవోలపై ఏటువంటి చర్యలు లేవు అని అన్నారు. భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం సర్వసాధారణం అని ఆయన పేర్కొన్నారు. అనువంశిక దర్మకర్తగా పనిచేసిన వ్యక్తిగా రామతీర్దం దేవాలయంలో ద్వంసం అయిన విగ్రహాల  స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుకు  డోనేషన్  ఇచ్చాను అని ఆయన పేర్కొన్నారు. విరాళాలు ఇచ్చిన వాటిని వెనక్కి ఇవ్వడం సరికాదు అని ఆయన పేర్కొన్నారు. డిజిపి నిజాలు చెప్పడం నేర్చుకోవాలి అని సూచించారు. రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేసి కనీసం పాటించడంలేదు అని మండిపడ్డారు.


వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాంతులు... ఏమైనా అవుతుందా....?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>