PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/bhuma-akhilapriya-jagatvikhyatreddy-bhargav261c5f1c-f5c4-4d42-9a1c-1c6a548d3ab4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/bhuma-akhilapriya-jagatvikhyatreddy-bhargav261c5f1c-f5c4-4d42-9a1c-1c6a548d3ab4-415x250-IndiaHerald.jpgబోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో రోజురోజుకు అనేక మలుపులు, ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ఈ కిడ్నాప్‌తో సంబంధం ఉన్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ కిడ్నాప్‌‌ను 10 మంది బృందం మాత్ర‌మే చేశార‌ని ముందుగా పోలీసులు భావించారు. అయితే దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ లింకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ క్రమంలో కిడ్నాప్ కేసులో నిందితుల సంఖ్య 19 మందికి చేరగా… తాజాగా 23కు చేరుకుంది. సీసీ ఫుటేజ్, కాల్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటి నుంచి ఈ కేసును పోలీసులు దర్యాప్తుakhilapriya;manu;goa;hyderabad;vijayawada;police;bhuma akhila priya;minister;hafiz saeed;petta;bowenpallyబోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...akhilapriya;manu;goa;hyderabad;vijayawada;police;bhuma akhila priya;minister;hafiz saeed;petta;bowenpallySat, 16 Jan 2021 08:07:14 GMTబోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో రోజురోజుకు అనేక మలుపులు, ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ఈ కిడ్నాప్‌తో సంబంధం ఉన్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ కిడ్నాప్‌‌ను 10 మంది బృందం మాత్ర‌మే చేశార‌ని ముందుగా పోలీసులు భావించారు. అయితే దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ లింకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ క్రమంలో కిడ్నాప్ కేసులో నిందితుల సంఖ్య 19 మందికి చేరగా… తాజాగా 23కు చేరుకుంది. సీసీ ఫుటేజ్, కాల్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటి నుంచి ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. కిడ్నాప్ సమయంలో వచ్చిన డయల్ 100 ఫోన్‌కాల్‌ను కూడా పోలీసులు అంతే కీలకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి లోని బాధితుల నివాసానికి సమీపంలోని పలువురితో మాట్లాడిన పోలీసులు, సుమారు 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి వేర్వేరు ప్రాంతాల్లో విచారించినట్టుగా విశ్వసనీయ సమాచారం.



హఫీజ్  పెట్ ఆ కిడ్నాప్ వ్యవహారంలో విజయవాడకు చెందిన సిద్ధార్థ కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో బయట పడింది.  సిద్ధార్థ మనుషుల తరలింపులో  కీలక పాత్ర పోషించారని  టాస్క్ ఫోర్స్ విచారణలో బయట పడింది. కిడ్నాప్ వ్యవహారం లో మరొక 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా,  విజయవాడ,  గుంటూరు హైదరాబాద్ లో వీరిని కస్టడీలో కి తీసుకున్నారు.  వీరి వద్ద నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారాలు రాబట్టారు.  అయితే కిడ్నాప్ ప్లాన్ ఎవరిచ్చారు అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  ఎంతమందిని కిడ్నాప్ లో ఎందుకు ఇన్వాల్వ్ చేశారో అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.



ఇదిలా ఉండ‌గా పోలీసుల విచార‌ణ‌లో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ ఆచితూచి స‌మాధానం చెబుతోందంట‌.  ‘‘మా భూములను ప్రవీణ్‌రావు ఆక్రమించాడు. మాకు అన్యాయం జరిగింది. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఇరికించారే తప్ప.. ఈ కిడ్నా్‌పతో నాకు ఎలాంటి సం బంధం లేదు’’ అని  పోలీసులకు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.  మూడు రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట మహిళా ఠాణాలో విచారించిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలను చూపుతూ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆమె బదులిచ్చినట్లు సమాచారం.




సంక్రాంతి పోరు లో ఎవరు గెలిచినట్లు..?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>